ఘోర ప్రమాదం: 7గురు బిహు కళాకారుల మృతి, 13మందికి గాయాలు
డిస్పూర్: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు బిహు నృత్య కళాకారులు మృతి చెందారు. కళాకారుల బృందం ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఎదురుగా వస్తున్న డంపర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు కళాకారులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. దిగ్బాయ్ పట్టణ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మరో 13 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు దిబ్రూగర్ జిల్లాలోని తిన్సుకియా సివిల్ ఆస్పత్రి, అస్సాం మెడికల్ కాలేజీ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
ఆరుగురు మృతులను గుర్తించినట్లు తెలిపారు. మృతులలో దీపికా మోరాన్(16), అన్నీ మోరాన్(18), ఆకాశ్ ప్రతీం శర్మ(21), బిశ్వజిత్ చేతియా(23), సంజిబ్ సఖబ్(20), ఖగెన్ దాస్(21)లు ఉన్నారని తెలిపారు.

తుఫాను: బీహార్‌లో 54కు చేరిన మృతుల సంఖ్య
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తుఫాను తాకిడికి మృతి చెందిన వారి సంఖ్య 54కు పెరిగింది. మరో 12 మంది మృతుల్ని గుర్తించడంతో ఈ సంఖ్య పెరిగిందని ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రాష్ట్రంలో రెండు రోజుల క్రితం తుఫాను ధాటికి మూడు జిల్లాలో తీవ్ర దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా, మృతి చెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 4లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications