బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఏడుగురు మృతి, 9 మందికి తీవ్రగాయాలు
తమిళనాడులో కాంచీపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.
చెన్నై: తమిళనాడులో కాంచీపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.

బాణాసంచా తయారీతోపాటు స్టోరేజీ సౌలభ్యం ఉండే ఈ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి సృష్ణమైన కారణాలేవీ తెలియదని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, కురువిమలై వరాలతోట్ ప్రాంతంలో 'నరేంద్రన్ ఫైర్ వర్క్స్' అనే ఈ ప్రైవేట్ యాజమాన్యంలోని బాణసంచా తయారీ ప్లాంట్ 20 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ ప్లాంట్‌లో 30 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications