ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనం
చెన్నై: తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. భర్త తనన్ని చాలా కాలంగా కాపురానికి పిలవడం లేదనే కోపంతో ఆ ఇంటి కోడలే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం భార్యభర్తలైన కన్నన్ (27), పాందీశ్వరి (25) మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. భర్త అదే గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా, పాందీశ్వరి వేరే ఇంట్లో ఉంటోంది.

తన భర్త, అతని కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రస్తున్న సమయంలో బయట నుంచి గడి పెట్టిన పాందీశ్వరి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
దీంతో భర్త, అత్తమామలతో పాటు ఏడుగురు సజీవ దహనమయ్యారు. అందరూ నిద్రలోనే తమ తుది శ్వాసను విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గతంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో, ఎందుకు ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందోననే కోణంలో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications