ప్రమాదానికి గురైన విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్
Visakhapatnam - Amritsar Hirakud Express: విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్య రాకపోకలు సాగించే హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయిదు బోగీలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల ఆరు గంటల పాటు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుందీ ఎక్స్‌ప్రెస్.
మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్ వద్ద ఈ ఘటన సంభవించింది. 20807 నంబర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 12:41 నిమిషాలకు విశాఖపట్నం నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరింది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, సంబాల్‌పూర్ జంక్షన్, బిలాస్‌పూర్ జంక్షన్ మీదుగా అనూప్‌పూర్ జంక్షన్‌కు సమీపించిన సమయంలో ప్రమాదానికి గురైంది.

అనూప్‌పూర్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి పట్టాల మీదికి దూసుకుని వచ్చింది. లెవెల్ క్రాసింగ్ వద్ద మూసివున్న రైల్వే గేటును దాటుకుని అతివేగంతో రైలును ఢీకొట్టి.. రైలు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. కొన్ని మీటర్ల వరకు కారును లాక్కు వెళ్లడంతో హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు దెబ్బతిన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ గాయపడ్డాడు. రైలు ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ప్రమాదం వల్ల రైలు ఆరు గంటల పాటు ఆలస్యంగా అనూప్‌పూర్ నుంచి బయలుదేరింది. రాత్రి 11:25 నిమిషాలకు అమృత్‌సర్‌కు చేరుకోవాల్సిన ఈ రైలు ఈ తెల్లవారు జామున గమ్యస్థానానికి చేరుకుంది.
#WATCH | Anuppur, Madhya Pradesh: Several coaches of Visakhapatnam - Amritsar Hirakud Express train were damaged after a high-speed car broke the closed railway crossing and rammed into the train. pic.twitter.com/RRxz3tgRnV
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 6, 2024












Click it and Unblock the Notifications