కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి: నదిలో పడిపోయిన 400 మంది సందర్శకులు, మోడీ దిగ్భ్రాంతి

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపైకి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఒక్కసారిగా.. ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో వందల సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ కేబుల్ బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహించిన మూడు రోజుల తర్వాత తిరిగి సందర్శకులను అనుమతించారు. అయితే, ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సామర్థ్యానికి మించిపోవడంతో ఆ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న సుమారు 400 మందికిపైగా సందర్శకులు నదిలో పడిపోయారని పోలీసులు తెలిపారు.

several Feared Injured In Cable Bridge Collapse In Morbi, Gujarat.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నదిలో పడిపోయిన వారిని బయటికి తీసి వెంటనే వెంటనే అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 30 మంది మరణించినట్లు సమాచారం.

ప్రమాద ఘటనంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురైనట్లు వెల్లడించారు. గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్, ఇతర అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సీఎం పటేల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+