వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్ సీఎస్ కర్ణన్..ప్రశాంత్ భూషణ్: ఇద్దరి కేసులో సారూప్యత: ఒకరికి జైలు..మరొకరికి మద్దతు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ శిక్షను ఎదుర్కొంటున్నారు. ఆయనకు మద్దతుగా బార్ కౌన్సిల్ సభ్యులు అండగా నిలుస్తున్నారు. ప్రశాంత్ భూషణ్‌కు మద్దతు ప్రకటించారు. ప్రశాంత్ భూషణ్‌పై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఆయనకు విధించాల్సిన శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం వాదనలను వినబోతోంది. కోర్టు ధిక్కారానికి పాల్పడిన కేసులో ప్రశాంత్ భూషణ్‌ దోషిగా తేలారు. ఈ మేరకు ఆగస్టు 14న తీర్పు వెలువడింది. ఈ తీర్పును ఆయన సవాల్ చేశారు. రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ గురువారం విచారణకు రానుంది.

ఈ కేసులో ప్రశాంత్ భూషణ్‌కు న్యాయవాదులు, బార్ అసోసియేషన్లు అండగా నిల్చన్నాయి. 1500 మందికి పైగా న్యాయవాదులు..ఆయనకు మద్దతుగా సంతకాలు చేశారు. అదే సమయంలో కోల్‌కత న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్.. ఇలాంటి కేసులోనే శిక్షను అనుభవించారు. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారనే కారణంతో ఆయనకు ఆరునెలల జైలుశిక్షను విధించింది న్యాయస్థానం. ఈ శిక్షను ముగించుకుని సీఎస్ కర్ణన్.. ఇటీవలే కోల్‌కత కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు. న్యాయమూర్తుల్లో పలువురు అవినీతిపరులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన రేపాయి.

Several judges spoke in support to Prashant Bhushan many of them silent on Justice CS Karnan

ఈ రెండు ఘటనల మధ్య సారూప్యం ఉంది. ఒకే తరహా శిక్షను ఎదుర్కొన్నారు. సీఎస్ కర్ణన్ విషయంలో అప్పట్లో ఎవరూ ఆయనకు మద్దతుగా నిలవలేదు. ఆయన కోసం తమ నిరసన గళాన్ని వినిపించలేదు. న్యాయస్థానానికి క్షమాపణ చెబితే సరిపోతుందంటూ ఆదేవించినప్పటికీ.. కర్ణన్ వెనక్కి తగ్గలేదు. శిక్షను అనుభవించడానికే సిద్ధపడ్డారు తప్ప.. తాను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఆరునెలల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు. రెండు వేల రూపాయల జరిమానా లేదా ఆరునెలల జైలు శిక్షను అనుభించాల్సి ఉండగా.. కర్ణన్ శిక్షను అనుభవించడానికే మొగ్గు చూపారు. గరిష్ఠ స్థాయి శిక్షను అనుభవించారు.

అప్పట్లో ఆయనకు ఎవరూ అండగా లేరని, ప్రశాంత్ భూషణ్‌కు మాత్రం వందలాదమంది న్యాయవాదులు, కొందరు న్యాయమూర్తులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారని ది ప్రింట్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి ప్రధాన కారణం.. కులం అనే కోణమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సీఎస్ కర్ణన్ దళితుడు కావడం, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్లే ఆయనకు జ్యుడీషియరీ వ్యవస్థ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదనే అభిప్రాయాన్ని ది ప్రింట్ వ్యక్తం చేసింది. ప్రశాంత్ భూషణ్ మాత్రం జ్యుడీషియరీ వ్యవస్థలో శక్తిమంతుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశమని పేర్కొంది.

English summary
Several judges even spoke in his support to Prashant Bhushan. But not too long ago, many of them watched silently when Justice C.S. Karnan was sent to jail for six months for calling out corrupt judges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X