వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్ర ఎండతో తల్ల‘ఢిల్లీ’: దేశ రాజధానిలో 49 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, వడగాలులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీలో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితి ఆదివారం కూడా కొనసాగింది, కొన్ని చోట్ల ఉష్ణోగరతలు 49 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు భారత వాతావరణ శాఖ అధికారిక బులెటిన్ ప్రకారం.. ముంగేష్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 49.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, నజఫ్‌ఘర్‌లో 49.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 48.4 డిగ్రీల సెల్సియస్, జాఫర్‌పూర్ 47.5 డిగ్రీల సెల్సియస్, పితంపురా 47.3 డిగ్రీల సెల్సియస్, రిడ్జ్ 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది.

ఢిల్లీ బేస్ స్టేషన్, సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో, గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు పాయింట్లు పెరిగి 45.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఈ సంవత్సరం అత్యధికం. దేశ రాజధానిలోని అన్ని స్టేషన్లలో హీట్ వేవ్ డే నమోదైంది.

Severe heatwave: Two Weather Stations Record Temperature Above 49 Degree Celsius In Delhi

పొరుగున ఉన్న గురుగ్రామ్‌లో కూడా 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఇది మే 10, 1996లో మెర్క్యూరీ 49 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడిన తర్వాత అత్యధికంగా నమోదైంది.

కాగా, దేశ రాజధానిలో సోమవారం ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బలహీనమైన పాశ్చాత్య అవాంతరాల కారణంగా అతి తక్కువ వర్షాలతో, ఢిల్లీ 1951 నుంచి ఈ సంవత్సరం రెండవ అత్యంత వేడిగా ఏప్రిల్‌లో నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 40.2 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది.

English summary
Severe heatwave: Two Weather Stations Record Temperature Above 49 Degree Celsius In Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X