షాకింగ్: ఫేస్ బుక్ లో శృంగారం లైవ్ స్ట్రీమింగ్.. యువకుడి అరెస్టు
కేరళలో ఓ యువకుడు మహిళతో శృంగారాన్ని నెరుపుతూ.. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
కొచ్చి: చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఏదైనా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లభిస్తోంది. అయితే, ఈ టెక్నాలజీని దుర్వినియోగపరిచేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా కేరళలో ఓ యువకుడు మహిళతో శృంగారాన్ని నెరుపుతూ.. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై అతడు అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక మీడియా, పోలీసుల కథనాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

లిను(23) అయే యువకుడికి ఇడుక్కీలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వివాహిత అయిన ఆమెకు ఓ చిన్నారి కూడా ఉంది. అయితే, భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ ఆరు నెలలుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన లిను తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను ఆ మహిళతో శృంగారంలో పాల్గొంటూ.. అదే సమయంలో ఆ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారిపోయింది.
ఇద్దరు పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. ఆ దృశ్యాలను లిను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి ఆమెకు తెలిసి ఉండకపోవచ్చునని పోలీసులు అంటున్నారు. అయితే లైక్ ల కోసమే తాను లైవ్ స్ట్రీమింగ్ చేశానని.. ఈ విషయం ఆమెకూ తెలుసనని లిను ఆరోపిస్తున్నాడు.
లిను ఫోన్‌లో ఇద్దరూ సన్నిహితంగా గడుపుతున్న వీడియోలు మరికొన్ని దొరికాయని పోలీసులు అంటున్నారు. ఆ మహిళపై ప్రతీకారం తీర్చుకోవడానికో, కోపం ప్రదర్శించడానికో అతను ఇలా ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొనడంతో ఆ మహిళ పెట్టిన రేప్ కేసు మాత్రం నిలబడదని అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications