హైటెక్ సెక్స్ రాకెట్: 20 మంది అరెస్టు

ఇండోర్: హైటెక్ టెక్నాలజీకి అలవాటు పడిన బానిసలను అన్ని విధాల వాడుకోవడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వ్యభిచారం విషయంలో హై టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. హై టెక్ సెక్స్ రాకెట్ ల కోసం విలాసవంతమైన హోటళ్లు వాడుకుంటున్నారు.

ఇండోర్ లో ఇలాంటి సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు మహిళలతో పాటు మొత్తం 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇండోర్ లోని ఓ ప్రసిద్ధి చెందిన హోటల్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచాం వచ్చింది.

విషయం తెలుసుకున్న మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ జ్యోతి శర్మ హోటల్ మీద దాడి చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకుని హైటెక్ సెక్స్ రాకెట్ ముఠానుఅరెస్టు చేశారు. ఈ హోటల్ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులే సమాచారం ఇచ్చారని పోలీసు అధికారి జ్యోతి శర్మ తెలిపారు.

Sex racket busted in a hotel in Indore

అమిత్ అనే వ్యక్తి ముగ్గురు బ్రోకర్లతో కలిసి అమ్మాయిలను సరఫరా చేస్తూ ఈ దందా నిర్వహిస్తున్నాడని ఆమె అన్నారు. అరెస్టు అయిన వారందరూ స్థానికులే అని జ్యోతి శర్మ చెప్పారు. ఈ విషయాన్నినిందితులలో ఒకరు విచారణలో అంగీకరించారని జ్యోతి శర్మ అన్నారు.

ఈ హటల్ యజమాని మహేష్ పండిట్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు. పార్టీ నాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని సంతోష్ ఠాగూర్ అనే వ్యక్తికి నెలకు రూ. 1.20 లక్షలు హోటల్ అద్దెకు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అరెస్టు చేసిన సమయంలో హోటల్ లో మద్యం సీసాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జ్యోతి శర్మ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+