సెక్స్ రాకెట్ రట్టు: పట్టుబడ్డ 6గురు యువతులు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ఓ సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు. పోలీసులు ఆరుగురు యువతులు సహా పదిమందిని అరెస్టు చేశారు. ఇది లఖింపూర్ ఖేరీలో జరిగింది. ఈ సెక్స్ రాకెట్‌ను పలువురు స్థానికులు నడుపుతున్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. సెక్స్ రాకెట్ నడుపుతున్న వారు.. కొందరు యువతులను ఇతర జిల్లాల్లో అమ్మినట్లుగా చెబుతున్నారు.
సెక్స్ రాకెట్‌లో అరెస్టయిన ఆరుగురు యువతులను విచారిస్తే.. ఎక్కడెక్కడ సెక్స్ రాకెట్లు నడుస్తున్నాయో చెప్పారని, త్వరలో అక్కడ కూడా రెయిడ్ చేస్తామని పోలీసులు చెప్పారు.

ఈ సెక్స్ రాకెట్‌తో పాటు పలుచోట్ల వీటిని నడుపుతున్న నలుగురిని పోలీసులు గుర్తించారు. వారిని మైకు, తనయ్, మోహిత్, సునీల్‌గా గుర్తించారు. వీరి నలుగురితో పాటు ఆరుగురు యువతులు, మహిళలను అరెస్టు చేశారు. ఈ ఆరుగురిలో ఒక మైనర్ గర్ల్‌తో పాటు ఓ ఏజ్డ్ మహిళ కూడా ఉంది.
సెక్స్ రాకెట్లో పట్టుబడ్డ యువతులు చెప్పిన సమాచారం మేరకు.. లక్నోకు చెందిన ఓ మైనర్ బాలికను సితాపూర్ జిల్లాలో అమ్మారు. సెక్స్ రాకెట్ నడుపుతున్న వారికి చెందిన రిలేటివ్ ఒకరు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో ఇది బయటపడింది.












Click it and Unblock the Notifications