హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఇద్దరి అరెస్టు, ముగ్గురు బాలికలకు విముక్తి
ముంబై పోలీసులు మంగళవారం రాత్రి ఓ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు. ముంబై కుర్లాలోని కామ్‌గార్ నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ సెక్స్ రాకెట్ బయటపడింది. ఈ సం
ముంబై: ముంబై పోలీసులు మంగళవారం రాత్రి ఓ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు. ముంబై కుర్లాలోని కామ్‌గార్ నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ సెక్స్ రాకెట్ బయటపడింది.
ఈ సందర్భంగా పోలీసులు సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. కుర్లా ప్రాంతంలో ఉన్న మంగళ్ మూర్తిలోని ఓ బంగళాలో ఈ ఇద్దరు మహిళలు గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు డీసీపీ షాహాజీ ఉమాప్ వెల్లడించారు.

సోదాల సందర్భంగా పోలీసులు వీరి చెరనుంచి ముగ్గురు బాలికలకు కూడా విముక్తి కల్పించారు. దాడుల సందర్భంగా పోలీసులు మరో ఇద్దరు విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
మంగళ్ మూర్తిలోని ఆ బంగళాలో వ్యభిచారం సాగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాత్రి నెహ్రూనగర్ పోలీసులు సదరు బంగళాపై దాడిచేశారు. నిందితులపై పెటా చట్టం సహా ఐపీసీ సెక్షన్ 370, 34ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications