నటితో రాసలీలలు: స్వామీజీ వివరణ: రూ. 5 కోట్లకు బ్లాక్ మెయిల్ చేశారు. వీడియో విడుదల !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని హుణసమారనహళ్ళిలోని దేవణాపుర మహా సంస్థాన మఠంలో కన్నడ నటితో రాసలీలలు జరిపిన దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ శుక్రవారం ప్రత్యక్షం అయ్యారు. ఆయన నేరుగా ప్రజల ముందు ప్రత్యక్షం కాకుండా ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు.

ఆ వీడియోలో స్వామీజీ ఇలా వివరణ ఇచ్చారు. 2014లో రహస్యంగా రాసలీలల వీడియో తీశారని వివరించారు. 2014 జనవరి 6వ తేదీన తాను పని మీద బయటకు వెళ్లి మఠంకు తిరిగి వస్తున్న సమయంలో మార్గం మధ్యలో తనను కొందరు అడ్డగించారని చెప్పారు. తరువాత రాసలీలల వీడియో చూపించి రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు.

Karnataka: Sex Scandal Case Bengaluru Swamiji Clarifies On Issue.

అంత డబ్బు ఇచ్చుకోలేని తాను రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఇస్తానని చెప్పానని దయానంద వివరించారు. తాను పోలీసు అంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి వచ్చి ఇరు వర్గాల మధ్య రూ. 45 లక్ష్లలకు రాజీ చేశాడని, 2014 నుంచి రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు చొప్పున రూ. 45 లక్షలు ఇచ్చానని దయానంద వివరించారు.

మరో రోజు ధర్మేంద్ర తన దగ్గరకు వచ్చి మధ్యవర్తిత్వం చేసిందుకు తనకు డబ్బులు అందలేదని రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే రాసలీలల సీడీలు అందరికీ పంచి పెడుతానని బెదిరించి రూ. 10 లక్ష్లలు తీసుకున్నాడని చెప్పారు. అనంతరం మహేష్ అనే వ్యక్తి తన దగ్గర కు వచ్చి రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడని వివరించారు.

నగదు ఇవ్వకుండా తాను ఆత్మహత్యాయత్నం చేసినందుకు సీడీలు విడుదల చేశారని దయానంద వాపోయారు. అయితే దయానంద ఎక్కడ ఉన్నారు ? అనే విషయం మాత్రం వెలుగు చూడలేదు. స్వామీజీతో రాసలీలలు జరిపిన కన్నడ నటి ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత ఆయన మళ్లీ ప్రత్యక్షం అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka: Sex Scandal Case Bengaluru Swamiji Clarifies On Issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి