మైనర్ భార్యతో 'సెక్స్' అత్యాచారమే, ఆ మినహాయింపు రద్దు: సుప్రీం కోర్టు
ఈ మేరకు ఐపీసీ, సెక్షన్ 375లో ఉన్న 2వ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Recommended Video

శృంగారం తర్వాత అసలు మైనర్ ని భార్య గా చేసుకోవడం ఏంటి ? | Oneindia Telugu
న్యూఢిల్లీ: మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మైనర్ వధువుకు ఉండే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్న మినహాయింపును రద్దు చేసింది.
ఈ మేరకు ఐపీసీ, సెక్షన్ 375లో ఉన్న 2వ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 18ఏళ్ల లోపు వయసున్న మైనర్ బాలికల ప్రాథమిక హక్కులకు విరుద్దంగా.. అదే సమయంలో వారితో శృంగార సంబంధాలను కొనసాగించే భర్తలకు మాత్రం రక్షణగా ఉన్నందునా కోర్టు దీన్ని రద్దు చేసింది.

15-18ఏళ్ల మధ్య వయసున్న భార్యలతో శృంగారం జరిపే పురుషులకు శిక్ష నుంచి మినహాయింపునివ్వరాదని కోర్టు వివరించింది. గత సంఘటనలు మినహాయిస్తే.. ఇప్పటినుంచి ఈ శిక్షలు వర్తిస్తాయని కోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications