వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసు పెడితే కుదరదు: సెక్స్ వర్కర్లపై సుప్రీం సంచలన తీర్పు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ ఒక మహిళ పెట్టిన కేసుపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఆ ముగ్గురూ డబ్బులు ఇవ్వలేదని బాధితురాలు వారిపై కేసు పెట్టిందని నమ్ముతూ, కస్టమర్లు డబ్బులు ఇవ్వనంత మాత్రాన సెక్స్ వర్కర్లు తమపై అత్యాచారం జరిగిందని చెప్పలేరని స్పష్టం చేసింది.

వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్పిస్తున్నామని చెప్పిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవరాయ్‌‌లతో కూడిన ధర్మాసనం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను తప్పనిసరిగా పరిశీలించాల్సిందేనని, అయితే.. వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఈ కేసు పూర్వపరాలను ఒక్కసారి పరిశీలిస్తే... బెంగళూరులో పనిమనిషిగా చేసే ఓ మహిళ, రాత్రిపూట వ్యభిచారం చేస్తుంటుంది. అయితే తనను ముగ్గురు వ్యక్తులు ఆటోలో తీసుకెళ్లి పదేపదే అత్యాచారం చేశారని కేసు పెట్టింది. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Sex worker can't cry rape if denied money: Supreme Court

నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా వారికి శిక్ష పడింది. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సాక్ష్యాధారాలన్నింటినీ మరోసారి పరిశీలించిన తర్వాత ఆ సమయంలో ఆమె ప్రవర్తన అత్యాచార బాధితురాలిలా లేదని, అది పరస్పర అంగీకారంతో జరిగినట్లే తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ కేసులో బాధితురాలి రూమ్‌మేట్ సాక్షిగా వచ్చి అసలు విషయాన్ని వెల్లడించారు. నిందితుల నుంచి బాధితురాలు డబ్బులు తీసుకునేదని, రాత్రుళ్లు ఆమె సెక్స్ వర్కర్‌గా పనిచేసేదని కోర్టుకు ఆమె తెలిపింది. అత్యాచారానికి ముందు నిందితులను వెయ్యి రూపాయలు అడిగిందని, వాళ్లు ఇవ్వడానికి నిరాకరించడంతో కేసు పెట్టిందని కోర్టుకు విన్నవించింది.

దీంతో ఆపై కేసు పెట్టిన బాధితురాలు సైతం కోర్టు ముందు నిజం చెబుతూ, కేసు పెడితే, డబ్బిస్తారన్న తన మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టింది. సాక్ష్యం చాలా బలంగా ఉందని, అందువల్ల ప్రాసిక్యూషన్ కేసును కొట్టేయాలంటూ డిఫెన్స్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నామని తీర్పు వెల్లడిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

English summary
Acquitting three persons of rape charges, the Supreme Court has ruled that a sex worker cannot lodge a sexual assault complaint against her customers if they refuse to pay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X