విమానంలో యువతికి లైంగిక వేధింపులు: ఎయిర్ ఏషియా ఇండియా వివరణ, అది జరిగింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానంలో యువతిపై లేంగిక వేధింపులు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ఎయిర్ ఏషియా ఇండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. నవంబర్ 3వ తేదీ ఐ5 1585లో రాంచీ నుంచి మీదుగా హైదరాబాద్ (వయా బెంగళూరు) బయలు దేరిన విమానంలో ఓ యువతి ప్రయాణించారని యాజమాన్యం చెప్పింది.

విమానం లేకాఫ్ అవుతున్న సమయంలో యువతి మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నదని, ఆమె నియమాలు ఉల్లంచిన విషయం గుర్తించిన క్యాబిన్ క్యూ సిబ్బంది ఫోన్ లో మాట్లాడకూడదని యువతికి సూచించారని వివరించింది. ఆ సందర్బంలో యువతి, విమాన సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగిందని మాజమాన్యం చెప్పింది.

Sexual harassment of a woman on the plane Air Asia India clarification.

విమానం బెంగళూరు చేరుకున్న తరువాత లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేసిన యువతిని మహిళా ఎయిర్ లైన్స్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతతో పిలుచుకుని వెళ్లి డీజీసీఎ, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎయిర్ ఏషియా ఇండియా యాజమాన్యం వివరించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము అలా చేశామని, విచారణ చెయ్యాలని పోలీసులకు మనవి చేశామని ఎయిర్ ఏషియా ఇండియా యాజమాన్యం తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sexual harassment of a woman on the plane Air Asia India clarification

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి