Target: షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ లు దేశం వదిలేయాలి, మేము కోట్లు ఇస్తుంటే మీరు జల్సా చేస్తారా !

బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపిన విషయం తెలిసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పుణ్యమా అంటూ ఇప్పుడు బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు మరోసారి రాజకీయ రంగు అంటుకుంది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ త్రయం ఉన్నంత వరకు ఈదేశం, బాలీవుడ్ చిత్రపరిశ్రమ బాగుపడదని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దయచేసి మీరు ముగ్గురు అఫ్గనిస్తాన్ వెళ్లిపోయి అక్కడ తాలిబన్లతో కలిసి చక్కటి సినిమాలు తీసుకుని కోట్ల రూపాయల డబ్బులు సంపాధించండి అంటూ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఉచిత సలహా ఇచ్చారు. మీరు నటిస్తున్న సినిమాలు కొన్ని కోట్ల మంది హిందువులు చూసి మీకు దిక్కులేనంత ఆధాయం తెచ్చిపెడుతున్నారు. మీరు సంపాధిస్తున్న డబ్బుతో మీ బిడ్డలు కొవ్వు పట్టి ఊరిమీద పడి డ్రగ్స్ సేవిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇలాంటి వారి కారణ:గా భారతదేశానికి మచ్చ వచ్చే అవకాశం ఉందని సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు బెంగళూరు డ్రగ్స్ కేసు కూడా ప్రజలు ఊహించనంత వేగంగా దర్యాప్తు జరగడం లేదని, ప్రజలు ఊహించినట్లు విచారణ జరిగితే కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు జైలుపాలు అయ్యే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

ఆయన పేరు చెబితే సొంతపార్టీలోనే రచ్చరచ్చ

ఆయన పేరు చెబితే సొంతపార్టీలోనే రచ్చరచ్చ

కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ పేరు చెబితే సొంతపార్టీలోని నాయకులే ఉలిక్కిపడతారు. బీఎస్. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనాయా చేసే వరకు తాను గడ్డం గీచుకోను అంటూ శపథం చేసిన బసవనగౌడ పాటిల్ యత్నాల్ తీరుతో అప్పట్లో సొంత పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు.

హాట్ టాపిక్ కు కేరాఫ్ అడ్రస్ యత్నాల్

హాట్ టాపిక్ కు కేరాఫ్ అడ్రస్ యత్నాల్

బీఎస్. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చెయ్యడం, బసవరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పది నిమిషాల్లో నీట్ గా షేవింగ్ చేసుకుని మీడియా ముందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ హమ్మయ్యా, దేవుడు నాకోరిక తీర్చేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. నిత్యం ఏదోఒక హాట్ టాపిక్ మాట్లాడుతూ మీడియాలో రచ్చర్చ చేసే బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ ఇప్పుడు బాలీవువడ్ టాప్ హీరోలను టార్గెట్ చేసుకుని కర్ణాటకోని విజయపురలో మీడియా ముందుకు వచ్చారు.

 ఈ ముగ్గురు నాశనం చేస్తున్నారు

ఈ ముగ్గురు నాశనం చేస్తున్నారు

బాలీవుడ్ టాప్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ (ఖాన్ త్రయం) బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయలు సంపాధిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. మీరు నటిస్తున్న సినిమాలు కొన్ని కోట్ల మంది హిందువులు చూసి మీకు దిక్కులేనంత ఆధాయం తెచ్చిపెడుతున్నారు. మీరు సంపాధిస్తున్న డబ్బుతో మీ బిడ్డలు కొవ్వు పట్టి ఊరిమీద పడి డ్రగ్స్ సేవిస్తూ జల్సాలు చేస్తున్నారని యత్నాల్ ఖాన్ త్రయం మీద మండిపడ్డారు.

ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోయి తాలిబన్లతో సినిమాలు తీసుకోవాలని సలహా

ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోయి తాలిబన్లతో సినిమాలు తీసుకోవాలని సలహా

బాలీవుడ్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ త్రయం ఉన్నంత వరకు ఈదేశం, బాలీవుడ్ చిత్రపరిశ్రమ బాగుపడదని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దయచేసి మీరు ముగ్గురు అఫ్గనిస్తాన్ వెళ్లిపోయి అక్కడ తాలిబన్లతో కలిసి చక్కటి సినిమాలు తీసుకుని కోట్ల రూపాయల డబ్బులు సంపాధించండి అంటూ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు ఉచిత సలహా ఇచ్చేశారు.

 దేశద్రోహం చేస్తున్న వారసులు

దేశద్రోహం చేస్తున్న వారసులు


షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు నటిస్తున్న సినిమాలు కొన్ని కోట్ల మంది హిందువులు చూసి మీకు దిక్కులేనంత ఆధాయం తెచ్చిపెడుతున్నారు. మీరు సంపాధిస్తున్న డబ్బుతో మీ బిడ్డలు కొవ్వు పట్టి ఊరిమీద పడి డ్రగ్స్ సేవిస్తూ జల్సాలు చేస్తున్నారని, మీరు దేశద్రోహం పనులకు పాల్పడి ఈదేశానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని, వెంటనే మీరు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు.

డ్రగ్స్ కారణంగా ఉగ్రవాదం పెరిగిపోతుంది

డ్రగ్స్ కారణంగా ఉగ్రవాదం పెరిగిపోతుంది

భారతదేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవించేవారు ఎక్కువ అయితే ఉగ్రవాదం పెరిగిపోయే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అణచివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శక్తివంచనలేకుండా పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ గుర్తు చేశారు.

ప్రధాని మోదీ కష్టపడుతుంటే మీరు నాశనం చేస్తున్నారు

ప్రధాని మోదీ కష్టపడుతుంటే మీరు నాశనం చేస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ ఇలా కష్టపడుతుంటే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లాంటి వాళ్లు డ్రగ్స్ సేవించి దేశానికి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. ఉన్నత చదువులు చదివిని వారిని ఈ బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ మండిపడ్డారు.

డ్రగ్స్ మాఫియా హిందువులను టార్గెట్ చేసింది

డ్రగ్స్ మాఫియా హిందువులను టార్గెట్ చేసింది


బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా విద్యావంతులైన హిందూ యువకులను టార్గెట్ చేసుకుని పని చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. హిందువుల జనసంఖ్య తగ్గించడానికి ఆ డ్రగ్స్ మాఫియా పనిచేస్తోందని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాను అంతం చెయ్యడానికి మనం అందరూ కష్టపడి పని చెయ్యాల్సిన అవసరం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు.

 హోమ్ మంత్రి చర్యలు తీసుకోవాలి

హోమ్ మంత్రి చర్యలు తీసుకోవాలి

కర్ణాటకలో డ్రగ్స్ మాఫియాను అంతం చెయ్యడానికి ఆ రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అరగ జ్ఞానేంద్ర కృష్టి చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు బెంగళూరు డ్రగ్స్ కేసు కూడా ప్రజలు ఊహించనంత వేగంగా దర్యాప్తు జరగడం లేదని, ప్రజలు ఊహించినట్లు విచారణ జరిగితే కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు జైలుపాలు అయ్యే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

ఆర్యన్ ఖాన్ పుణ్యమా అంటూ రాజకీయ రంగు

ఆర్యన్ ఖాన్ పుణ్యమా అంటూ రాజకీయ రంగు


బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అప్పటి ప్రభుత్వం (యడియూరప్ప ప్రభుత్వం) సక్రమంగా పని చెయ్యలేదని, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ పరోక్షంగా మండిపడ్డారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపిన విషయం తెలిసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పుణ్యమా అంటూ ఇప్పుడు బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు మరోసారి రాజకీయ రంగు అంటుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+