ర్యాంపు వివాదం: షారుఖ్ ఖాన్‌కు రూ. 1.93 లక్షల జరిమానా
ముంబై: రహదారిని ఆక్రమించుకొని ర్యాంపు నిర్మించినందుకు గాను బాలీవుడు నటుడు షారుఖ్ ఖాన్‌కు బీఎంసీ రూ. 1.93 లక్షల జరిమానా విధించింది. మార్చి 12వ తేదీలోపు చెల్లించాలని గడువు విధించింది. చెల్లించకపోతే తదుపరి చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.
బాంద్రాలోని షారుఖ్ 'మన్నత్' నివాసం వెలుపల రహదారిని ఆక్రమించుకొని నిర్మించిన ర్యాంపును బీఎంసీ అధికారులు గత నెల తొలగించిన విషయం తెలిసిందే. మన్నత్ నివాసం వెలుపల వ్యాను పార్కింగ్ కోసం ఈ అక్రమ ర్యాంపును నిర్మించారు.

దీనిపై స్ధానికులు పలుమార్లు బీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు పట్టించుకోలేదు. ఇటీవలే ఎంపీ పూనమ్ మహాజన్ జోక్యం చేసుకోని తక్షణమే అక్రమ ర్యాంపుని పడగొట్టాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేకు లేఖ రాశారు.
దీంతో ముంబై మున్సిపల్ చట్టం 489(1)
సెక్షన్ కింద ర్యాంపు పడగొట్టడానికి అయిన ఖర్చు రూ. 1.93 లక్షలను షారుఖ్ ఖాన్ స్వయంగా చెల్లించాలని బీఎంసీ నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయమైన షారుఖ్ ఖాన్‌కు మార్చి 5న నోటీసులు పంపారు.












Click it and Unblock the Notifications