నేడే శని త్రయోదశి- ఈ రాశుల వారు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాల్సిందే

ఇవ్వాళ శని త్రయోదశి. హైందవ సంప్రదాయం ప్రకారం- త్రయోదశితో కలిసి వచ్చిన శనివారాన్ని శని త్రయోదశిగా పిలుస్తారు. శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా శనివారం నాడు శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటారు. అలాంటి రోజున త్రయోదశి కూడా కలిసి రావడం శివ కేశవులిద్దరి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

ఇవ్వాళ ఏ ఆలయానికైనా వెళ్లి పూజలు నిర్వహించాలి. ప్రత్యేకించి నవగ్రహాలను దర్శించాలి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం స్వామివారికి సమర్పించాలి. వాటిని శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువులుగా భావిస్తారు. వాటితో శని దేవుడికి పూజలు చేయడం లేదా దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి.

Shani Trayodashi

మహాశివుడికి ప్రీతికరమైన ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యడం, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం వల్ల రాహు కేతు దుష్ప్రభావం కూడా తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది. శని త్రయోదశి నాడు ప్రదోష కాల పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ రోజుల్లో కంటే శని త్రయోదశి నాడు జరిపే ప్రదోష కాల పూజలను అత్యధిక ఫలితాన్ని ఇస్తాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లాలి. అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. సాధారణంగా నల్ల నువ్వులతో చేసిన తైలాన్ని ఈ అభిషేకం కోసం వినియోగిస్తారు. అలాగే నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తారు.

Shani Trayodashi

జ్యోతిష్యం ప్రకారం అనూరాధా నక్షత్రానికి శని దేవుడు అధిపతి. అదే నక్షత్రంలో శని త్రయోదశి ఆరంభం కావడం దీని ప్రత్యేకత. ఇది అరుదుగా సంభవిస్తుంటుంది. ఈ రోజున మకరం, కుంభం, మీనం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల దోష విముక్తులవుతారని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఏలిననాటి శని అర్జాష్ఠమ శని, అష్టమ శని వల్ల సంభవించే దుష్ప్రభావాలు తొలగిపోతాయి.

Shani Trayodashi

శనీశ్వరుడు కొలువుదీరిన మహారాష్ట్రలోని శని సింగణాపూర్‌కు ఇవ్వాళ భక్తులు పోటెత్తుతారు. దేశ రాజధానిలోని శనిధామ్, పుదుచ్చేరికి సమీపంలోని కరైకల్- తిరునల్లార్‌లోని శని దేవాలయం, మధ్యప్రదేశ్‌లోని శనిచారా, ఇండోర్‌లోని ప్రఖ్యాత శని మహాత్ముడి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఇండోర్ శని ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. రాణి అహల్యాదేవి హోల్కర్ స్వయంగా ఇక్కడ వెలిసిన స్వామివారిని పూజించేవారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+