Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sharad Pawar.. సంచలనం: కన్నీరు పెట్టిన కార్యకర్తలు: వేదికపైనే చుట్టుముట్టారు

ముంబై: దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్సీపీ అధినేత పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ పదవి నుంచి వైదొలగినట్లు వెల్లడించారు. ఆయన ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే మహారాష్ట్ర మాజీ మంత్రులు, ఎన్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పట్టుబట్టారు. శరద్ పవార్‌ను వేదికపైనే చుట్టుముట్టారు. సీనియర్ నేత ధనంజయ్ ముండే కన్నీరు మున్నీరయ్యారు. అనూహ్యంగా తలెత్తిన ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శరద్ పవార్ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు వేదిక మీదికి తరలిరావడంతో గందరగోళం నెలకొంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Sharad Pawar announces resignation as NCP chief,

ముంబైలో ఏర్పాటైన ఓ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లోక్ మాఝే సంగత్ పేరుతో గతంలో ఆయన తన రాజకీయ ఆత్మకథతో పుస్తకాన్ని రాశారు. దీన్ని రివైజ్డ్ వర్షన్‌ను ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. భావోద్వేగంతో ప్రసంగించారు. రాజకీయ జీవితానికి పుల్‌స్టాప్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని శరద్ పవార్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు తాను దేశ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోన్నానని, ఎన్నో పదవులను అధిష్ఠించానని గుర్తు చేశారు. పార్టీ ప్రస్థానం గురించీ ప్రస్తావించారాయన. 1999లో ఎన్సీపీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచీ 24 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేస్తోన్నానని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.

ఇక తన రాజకీయ జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని శరద్ పవార్ స్పష్టం చేశారు. 1960 మే 1వ తేదీ నుంచి 2023 మే 1వ తేదీ వరకు ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నానని, తన రాజకీయ ప్రయాణం ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

విద్య, వ్యవసాయం, సహకార రంగం, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తోన్నానని శరద్ పవర్ వివరించారు. అలాగే- యువత, మహిళలు, విద్యార్థుల, కార్మికులు, దళితులు, గిరిజనులు, సమాజంలోని ఇతర బలహీన వర్గాల సమస్యలపై తాను దృష్టి సారిస్తానని, వారికోసం నిరంతరాయంగా పోరాడుతాననీ శరద్ పవార్ తేల్చి చెప్పారు.

రాజ్యసభ సభ్యుడిగా తన సభ్యత్వం ఇంకా ముగియలేదని, మూడు సంవత్సరాల కాలం మిగిలే ఉందని అన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో తాను రాష్ట్ర, జాతీయ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దానికి మించి మరే ఇతర బాధ్యతలను కూడా తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని శరద్ పవార్ అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+