వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరద్ పవార్‌కు కరోనా.. ఆరోగ్యంగానే ఉన్నానని ట్వీట్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రముఖులు కూడా దాని బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో తప్పించుకున్న చాలా మందికి ఇప్పుడు వైరస్ సోకుతుంది. తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కరోనా సోకింది. కొవిడ్ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆయన స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు కరోనా సోకిందని ట్వీట్ చేశారు.

అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శరద్ పవరా్ పేర్కొన్నారు. డాక్టర్లు సూచించిన మేరకు చికిత్స పొందుతున్నానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరూ తప్పనిసరిగా తగని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రీకాషన్స్ ముఖ్యం అని శరద్ పవార్ సూచించారు.

Sharad Pawar tests positive

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడి ఉంటారు. లక్షణాలు కూడా ఒకేలా ఉండటంతో ఏదీ కరోనో.. ఏదీ ఒమిక్రాన్ నిర్ధారించడం కష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కరోనా, ఒమిక్రాన్ ఓకేలా చూస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి, ఫిబ్రవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసరి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
NCP supremo Sharad Pawar has tested Covid positive. following the treatment as suggested by my doctor he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X