Girlfriend: గిరిష్మా మైండ్ గిర్రున తిరిగిపోయింది, తమిళనాడుకు కేసు బదిలి, ఎందుకంటే ?, కేరళలో !
తిరువనంతపురం/కన్యాకుమారి/చెన్నై: ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గిరిష్మా కేరళ పోలీసుల విచారణలో అనేక విషయాలు చెప్పిందని వెలుగు చూసింది. ప్రియుడిని హత్య చేసి కుటుంబ సభ్యులు చూపించిన కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకున్న గిరిష్మా ప్లాన్ బెడిసికొట్టింది. ప్రియుడి హత్య కేసు నుంచి తప్పించుకోవాలని అనుకున్న గిరిష్మా ఇన్ని రోజులు కేరళ పోలీసులకు అనేక స్టేట్ మెంట్ లు ఇచ్చింది. ఇన్ని రోజులు కేరళ పోలీసులు గిరిష్మా, షారోన్ రాజ్ కేసు విచారణ చేశారు. గిరిష్మా నిజాలు చెప్పిందా ?, లేక తప్పించుకోవాలని స్కెచ్ వేసిందా ? అని కేరళ పోలీసులు ఆరా తీశారు. అయితే కేసు విచారణ కేరళ నుంచి తమిళనాడుకు బదిలి కావడంతో గిరిష్మాకు ఇక కచ్చితంగా చుక్కలు కనపడుతాయని సమాచారం.

రెండు రాష్ట్రాల లవ్ స్టోరీ
కేరళలోని పరసాల మురియాంకరై ప్రాంతానికి చెందిన షారోన్ రాజ్ అలియాస్ షారోన్ (23) అనే యువకుడు, తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కలియకవిలై సమీపంలోని రామవర్మన్ సిరై ప్రాంతంలో (కేరళ సరిహద్దు)లో నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి గిరిష్మా (22) అనే అమ్మాయి ప్రేమించుకుని విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు వెళ్లి ఎంజాయ్ చేశారు.

మేడమ్ కు కోటీశ్వరుడి పెళ్లి సంబంధం
షారోన్ రాజ్ ప్రేమ విషయం గురించి తెలుసుకున్న గిరిష్మా కుటుంబ సభ్యులు అతని తో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. కోటీశ్వరుడైన యువకుడిని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటావని, షారోన్ ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందని కుటుంబ సభ్యులు గిరిష్మాకు చెప్పారని తెలిసింది.

ప్రియుడికి భయపడిన గిరిష్మా
ఇంట్లో చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని గిరిష్మా డిసైడ్ అయ్యింది. గతంలో షారోన్ తో తాను కలిసి తిరిగిన సమయంలో, సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు షారోన్ మొబైల్ ఫోన్ ఉన్నాయని, వాటిని డిలీట్ చెయ్యకపోతే తనకు ఎప్పటికైనా సమస్యలు వస్తాయని గిరిష్మా భయపడింది.

అక్కడే ప్రేమికుల మద్య తేడా వచ్చింది
కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యానని ప్రియుడు షారోన్ కు గిరిష్మా చెప్పింది. నన్ను కాదని నువ్వు వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటే గతంలో మనం తీసుకున్న ఫోటోలు, వీడియోలు నీకు కాబోయే భర్తకు పంపిస్తానని షారోన్ గిరిష్మాను బెదిరించాడని గిరిష్మా ఇప్పటికే పోలీసులకు చెప్పింది.

స్లోపాయిజన్ స్కెచ్ తో హత్య
మొబైల్ ఫోన్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చెయ్యడానికి షారోన్ అంగీకరించకపోవడంతో గిరిష్మాతో గొడవ జరిగింది. ప్రియురాలు గిరిష్మా ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పడంతో గత నెల 14వ తేదీన షారోన్ ఆమె ఇంటికి వెళ్లాడు. తరువాత గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి ఆమె ప్రియుడు షారోన్ కు ఇచ్చింది. జ్యూస్ తాగిన షారోన్ వాంతులు చేసుకుని కడుపునోప్పితో తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన షారోన్ చికిత్స విఫలమై చనిపోయాడు.

గిరిష్మా అందర్
షారోన్ రాజ్ తో పెళ్లి విషయంలో తాను వెనకడుగు వేశానని, షారోన్ మాత్రం పెళ్లి చేసుకోవాలని తన మీద ఒత్తిడి చేశాడని, ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశానని గిరిష్మా పోలీసుల విచారణలో చెప్పింది. తన ప్రియుడు షారోన్ కు తానే విషం ఇచ్చానని గిరిష్మా అంగీకరించిందని కేరళ పోలీసులు చెప్పారు.

కేరళ టూ తమిళనాడు
హత్యకు గురైన షారోన్ రాజ్ ఇల్లు పరసాలలో (కేరళ)లో ఉంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళ సరిహద్దులో గిరిష్మా ఇల్లు ఉంది. షారోన్ కు విషయం పెట్టింది గిరిష్మా ఇంటిలో. షారోన్ చనిపోయింది కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజ్ లో. అందువలన ఈ కేసులో ఇంతవరకు జరిపిన దర్యాప్తు వివరాలు పూర్తిగా తమిళనాడు పోలీసులకు అప్పగించాలని కేరళ పోలీసులు సిద్దం అయ్యారు. నివేదికతో పాటు గిరిష్మాను కూడా తమిళనాడు పోలీసులకు అప్పగించడానికి రంగం సిద్దం అయ్యింది.












Click it and Unblock the Notifications