Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శశి థరూర్ బిగ్ యూటర్న్ ? ఉపరాష్ట్రపతి ఛాన్స్ వేళ రాహుల్ కు మద్దతుగా..!

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఇందుకు మద్దతుగా ఎన్నో ఉదాహరణలు గతంలో చూశాం. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేరళలోని తిరువనంతపురం ఎంపీగా వరుసగా మూడుసార్లు గెలిచిన సీనియర్ నేత, అపర మేథావిగా పేరు తెచ్చుకున్న శశి థరూర్ తనకు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని అలిగి ఈ మధ్య ప్రధాని మోడీకీ, బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడా ఆయన పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది.

ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న థరూర్ కు తిరిగి కాంగ్రెస్ పార్టీయే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా థరూర్ ను నిలబెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో థరూర్ కూడా ఇప్పుడు రూటు మార్చేశారు. నిన్న మొన్నటి వరకూ ఆపరేషన్ సిందూర్ సహా పలు అంశాల్లో కాంగ్రెస్ తో విభేదించిన ఆయన.. ఇప్పుడు లోక్ సభలో విపక్ష నేత రాహుల్ కు మద్దతుగా మాట్లాడారు.

shashi tharoor supports rahul gandhi s votes stolen allegation amid rumours on vp candidature

నిన్న కర్నాటక, మహారాష్ట్రల్లో ఓట్ల చోరీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన రాహుల్ గాంధీ.. కీలక ఆధారాలు బయటపెట్టారు. దీంతో ఇరుకునపడ్డ కేంద్రం, బీజేపీ ఎదురుదాడికి దిగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా థరూర్ ఇవాళ ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఇందులో ప్రజాస్వామ్యం చాలా విలువైనది అంటూ సూక్తులు కూడా వల్లించారు. రాహుల్ చేసిన ఆరోపణలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఈసీని థరూర్ డిమాండ్ చేశారు.

shashi tharoor supports rahul gandhi s votes stolen allegation amid rumours on vp candidature

రాహుల్ గాంధీ లేవనెత్తినవి తీవ్రమైన ప్రశ్నలని, కాబట్టి అన్ని పార్టీలు, అందరు ఓటర్ల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకని వాటిని అంతే తీవ్రంగా పట్టించుకుని పరిష్కరించాలంటూ శశి థరూర్ సూచించారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్ధానంలో ఓట్ల చోరీని ప్రస్తావిస్తూ నిన్న రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజంటేషన్ వీడియోనూ కూడా థరూర్ తన ట్వీట్ తో పాటు షేర్ చేశారు. మన ప్రజాస్వామ్యం ఎంత విలువైనదంటే దాని విశ్వసనీయతను అసమర్ధత, నిర్లక్ష్యం నాశనం చేస్తున్నా పట్టించుకోనంత అని థరూర్ తేల్చేశారు. ఈసీ ఈ ఆరోపణలపై తక్షణం స్పందించి జాతికి సమాధానం చెప్పాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+