వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్‌జీబ్రా, పైథాగరస్ భారతీయులవే: కేంద్రమంత్రికి శశిథరూర్ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ శనివారం నాడు కేంద్రమంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలను సమర్థించారు. బీజ గణితం (ఆల్ జీబ్రా), పైథాగరస్ సిద్ధాంతం భారత దేశంలోనే జనించాయని, కీర్తిమాత్రం ఇతరులకు దక్కింతని హర్షవర్ధన్ అన్నారు. ఈ వ్యాఖ్యలను శశిథరూర్ సమర్థించారు.

హర్షవర్ధన్ వ్యాఖ్యలలో నిజమెంత అనే ప్రశ్నకు శశిథరూర్ ట్విట్టర్‌లో స్పందించారు. హిందుత్వ శక్తులు వీటిని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాయని, అంతమాత్రాన పురాతన భారతీయ సైన్సులోని వాస్తవ అంసాలను అసత్యాలుగా భావించవలసిన అవసరం లేదన్నారు. ప్రపంచంలోనే మొదటి శస్త్రచకిత్స వైద్యుడు శుశ్రుతుడు అని శశిథరూర్ వివరించారు.

కాగా, శనివారం జరిగిన భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో పురాతన భారతీయ శాస్త్రవేత్తలు దయతో ఇతర దేశాల శాస్త్రవేత్తలను అనుమతించారని అయితే మనవారు కనిపెట్టిన విషయాలకు వారు పేరు ప్రఖ్యాతలు పొందారని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు.

శశిథరూర్

శశిథరూర్

బీజ గణితం (ఆల్ జీబ్రా), పైథాగరస్ సిద్ధాంతం భారత దేశంలోనే జనించాయని, కీర్తిమాత్రం ఇతరులకు దక్కింతని హర్షవర్ధన్ అన్నారు. ఈ వ్యాఖ్యలను శశిథరూర్ సమర్థించారు.

హర్షవర్ధన్

హర్షవర్ధన్

బీజ గణితం (ఆల్ జీబ్రా), పైథాగరస్ సిద్ధాంతం భారత దేశంలోనే జనించాయని, కీర్తిమాత్రం ఇతరులకు దక్కింతని హర్షవర్ధన్ అన్నారు.

అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న 102వ భారత సైన్స్ కాంగ్రెస్‍‌లో రెండో రోజైన ఆదివారం నాడు మాజీ రాష్ట్రపతి కలాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్ కాంగ్రెస్‌లో తాను రూపొందించిన ప్రాజెక్టును కలాంకు వివరిస్తున్న యువశాస్త్రవేత్త.

ప్రకాశ్ జవదేకర్

ప్రకాశ్ జవదేకర్

శతాబ్దాల పాటు సాగిన అత్యంత సూక్ష్మమైన అధ్యయనాల ప్రాతిపదికగా, ఇటు అనుభవం అటు సహేతుకత పునాదిగానే భారతీయ ప్రాచీన విజ్ఞాన సిద్ధాంతాలు ఆవిర్భవించాయని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.

English summary
Former Union minister Shashi Tharoor has apparently come out in support of BJP minister Dr Harsh Vardhan's claim that Greeks and Arabs received credit for advances in Mathematics that rightfully belong to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X