వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక గాంధీకి ఘోర అవమానం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రియాంక గాంధీకి ఘోర అవమానం...!! || Oneindia Telugu

యూపీ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి ఘోర అవమానం జరిగింది. ప్రచారంలో భాగంగా వారణాసికి చేరుకున్న ఆమె లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు. ప్రియాంక అక్కడ వెనుదిరిగిన వెంటనే బీజేపీ కార్యకర్తలు విగ్రహాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదంగా మారింది.

శాస్త్రి విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ కార్యకర్తలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రియాంక బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అయితే ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే కొందరు బీజేపీ కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకుని ఆమె వేసిన పూలమాలను తొలగించారు. శాస్త్రి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య అయిన ప్రియాంక గాంధీకి శాస్త్రి విగ్రహాన్నితాకే అర్హత లేదని బీజేపీ కార్యకర్తలు విమర్శించారు.

మోడీ కోటలో ప్రియాంకా గాంధీ: కాశీ విశ్వనాథునికి రుద్రాభిషేకం: మెడలో రుద్రాక్షమాలమోడీ కోటలో ప్రియాంకా గాంధీ: కాశీ విశ్వనాథునికి రుద్రాభిషేకం: మెడలో రుద్రాక్షమాల

Shastri statue cleansed after Priyankas floral tribute

బీజేపీ తీరును తప్పుబట్టిన కాంగ్రెస్
ప్రియాంక తాకిందన్న నెపంతో శాస్త్రి విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు శుద్ధి చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనే విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని సూచించింది. దేశంలో గొప్ప వ్యక్తులందరి వారసులం తామేనని చెప్పుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని చురకలంటించింది.

English summary
BJP workers cleansed the statue of former prime minister Lal Bahadur Shastri minutes after Congress general secretary Priyanka Gandhi Vadra garlanded it in Varanasi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X