షారుఖ్ లా క్లీన్ షేవ్ చేసుకుంటావా? చావమంటావా? : ఓ భార్య

Subscribe to Oneindia Telugu

మీరట్ : ట్రెండ్ కు తగ్గట్టు ఉండాలనుకునే మనస్తత్వం ఆ భార్యది. సాంప్రదాయాలను నిక్కచ్చిగా పాటించాలనే ఫక్తు సాంప్రదాయ వ్యక్తిత్వం భర్తది. ఇంకేముంది.. ప్రతీ విషయంలో పేచీ మొదలైంది. గడ్డం దగ్గరినుంచి వేసుకునే బట్టల వరకు ప్రతీది ఓ సమస్యగా మారిపోయింది. దీంతో ఏంచేయాలో తోచని స్థితిలో సదరు భర్త స్థానిక కలెక్టర్ ను ఆశ్రయించడంతో విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ హీరోలు షారుఖ్, సల్మాన్ లాగా తన భర్త అర్ష‌ద్ బ‌హ్రుద్దీన్ (36)ను క్లీన్ షేవ్ లో చూడాలనేది భార్య సహానా కోరిక. అయితే భర్త అర్షద్.. ఒక మ‌సీదులో ప్రార్థ‌న‌ల‌ను నిర్వ‌హించే వృత్తిలో కొనసాగుతుండడంతో క్లీన్ షేవ్ అనేది తన వృత్తి ధర్మానికి విరుద్దం అని చెబుతూ వస్తున్నాడు. 2001లో పెళ్లయిన నాటి నుంచి భార్య భర్తలిద్దిరి మధ్య ఇదే పేచీ.

అయితే ఎన్నిసార్లు భర్తను క్లీన్ షేవ్ చేసుకోమని కోరినా.. అతను నిరాకరిస్తుండడంతో ఇక ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టింది భార్య సహానా. దీంతో ఏంచేయాలో అర్థంకాని స్థితిలో జిల్లా కలెక్టరుకు తన పరిస్థితి గురించి వివరిస్తూ లేఖ రాశాడు అర్షద్.

Shave or I'll kill myself: Wife to cleric

అదే లేఖలో.. తన భార్య వేరే పరాయి వ్యక్తులతో ఛాటింగ్ చేస్తోందని, అలాగే రంజాన్ పండుగ రోజు కూడా పిల్లలకు వెస్ట్రన్ బట్టలు కొనాలని పోరుపెట్టిందని పేర్కొన్నాడు. భార్య ప్రవర్తనతో తాను విసిగిపోయానని, ఆమె ప్రభావం పిల్లల మీద ఎక్కడ పడుతుందోనన్న ఆందోళన తనలో నెలకొందని లేఖలో వివరించాడు.

భార్య తీరు నచ్చక రంజాన్ రోజు ఆమెను తిట్టానని, దీంతో ఏడుపందుకున్న సహానా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా తలుపులు బద్దలు కొట్టి సహానాను కాపాడామని లేఖలో తెలిపాడు. కాబట్టి ఎలాగైనా తన భార్యకు కౌన్సెలింగ్ నిర్వహించాలని అర్షద్ కలెక్టర్ కు విజ్ఞ‌ప్తి చేశాడు.

కాగా, అర్షద్ లేఖను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thirty-six-year old Arshad Badruddin, a cleric here, is in a fix after his wife demanded that he should shave or else she would commit suicide. He even claimed that his wife was using a smartphone to chat with 'gair mard' (other men) against his wishes. Arshad has also asked the DM to arrange for counselling for his wife. He fears that he would be blamed if his wife takes the extreme step.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి