కూతురుకి పరీక్షలు: సోనియాపై ఎఎపి నేత షాజియా నో

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సీనియర్ నేత షాజియా ఇల్మి రాయ్ బరేలి నుండి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. తన కూతురుకు పరీక్షలు ఉన్నందున.. తాను దేశ రాజధాని ఢిల్లీ నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

షాజియా ఇల్మిని రాయ్ బరేలీ నుండి పోటీ చేయాలని ఎఎపి అధిష్టానం మొదటి నుండి కోరుతోంది. రాయ్ బరేలీ నుండి ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సోనియా పైన ఎఎపి తరఫున షాజియా ఇల్మి పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది.

Shazia Ilmi denies contesting Lok Sabha poll from Rae Bareli

అయితే, షాజియా ఇల్మి మాత్రం రాయ్ బరేలీ నుండి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. తాను రాయ్ బరేలీ నుండి పోటీ చేస్తానన్న వార్తలను ఇల్మి ఖండించారు. తాను డిల్లీలోనే ఏదో ఒక లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఢిల్లీలో పోటీ చేసేందుకు ఆమె తన కూతురు పరీక్షలను కారణంగా చూపిస్తున్నారట.

కాగా, తాను రాయ్ బరేలీ నుండి పోటీ చేయడం లేదని, తాను అక్కడి నుండి పోటీ చేసేందుకు పార్టీ చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అంగీకరించలేదని, గత రెండు నెలలుగా తాను అక్కడి నుండి టిక్కెట్ వద్దని చెబుతున్నానని ట్విట్టర్‌లో స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+