దారుణం: యువతిని గ్యాంగ్‌రేప్ చేసి నగ్నంగా పడేశారు

పోలీసుల కథనం ప్రకారం.. షెడ్యూల్ కులానికి చెందిన పదిహేనేళ్ల బాధిత యువతి(10 తరగతి విద్యార్థి) కుటుంబం స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. వీరు సిపిఎం పార్టీ మద్దతుదారులుగా తెలుస్తోంది. అయితే తమ భూమిలో వ్యవసాయం చేస్తున్నందున తమకు రూ. 40వేలు చెల్లించాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిల్ బర్మత్ తోపాటు పలువురు కార్యకర్తలు వారిని డిమాండ్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక కౌన్సిలర్ నమిత భర్త చంద్రకాంత్ ఆధ్వర్యంలో కంగారు కోర్టును నిర్వహించి ఈ మేరకు తీర్పు చెప్పాడు. వారికి వెంటనే రూ. 4వేలు చెల్లించాలని బాధితురాలి కుటాంబానికి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు నిరాకరించడంతో బాధితురాలి తండ్రి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధిత యువతి వారిని అడ్డుకుంది. దీంతో ఆమెను వారు బెదిరింపులకు గురి చేశారు.
కాగా, ఆ యువతిని సోమవారం రాత్రి ఎత్తుకెళ్లిన అనిల్ బర్మన్, ఇతర కార్యకర్తలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా రైలు పట్టాలపై పడేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సిపిఎం కార్యకర్తలు, యువకులు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ భర్త చంద్రకాంత్ తోపాటు 13మందిపై కేసు నమోదు చేశారు. నిందితుడు అనిల్ బర్మన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications