వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భవతి అని చెప్పారు, ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే కణితని తేల్చారు

వివాహమై ఏడేళ్ళు దాటినా అమీర్, హసీనా దంపతులకు పిల్లలు కలగలేదు. కడుపునొన్పి వచ్చిన హసీనాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే గర్భవతిగా చెప్పారు. నవంబర్ లో డెలివరీ డేట్ కూడ ఇచ్చారు. ఈ సమయానికి ముందుగానే కడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం మరోసారి బట్టబయలైంది. గర్బవతి కాకున్నా .... గర్భవతి అని చెప్పి వైద్యం చేశారు. డెలివరీ డేట్ కూడ ఇచ్చారు. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళిన వారు షాక్ అయ్యారు. గర్భవతి కాకుండా ప్రసవం ఎలా చేయాలని వైద్యులు తేల్చిచెప్పారు. కడుపులో కణితి పెరిగిందని దాన్ని తొలగించాలని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రభుత్వ డాక్టర్లపై ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెన్నైలోని కణ్ణగి నగర్ కు చెంిన హసీనా, అమీర్ అలీ దంపతులకు వివాహమై ఏడేళ్ళు అవుతోంది. అయినా సంతానం కలగలేదు. సంతానం కోసం ఆ దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కాని, ఫలితం లేకపోయింది.

ఒకరోజు హసీనాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమెను ట్రిప్లికేన్ లోని కస్తూర్భా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు భర్త అమీర్. ఈ ఆసుపత్రి వైద్యులు మంచి వార్త చెప్పారు ఆ దంపతులకు . హసీనా గర్భవతి అని తేల్చారు. ప్రతి నెలా పరీక్షల కోసం రావాలని రావాలని చెప్పారు.

she is not a pregnanent,tumor in stomach

నవంబర్ 18వ, తేదిన డెలివరీ డేట్ కూడ ఇచ్చారు. ఆమె కడపులో ఓ కణితి కూడ ఉందని ఆపరేషన్ చేసి కాన్సు చేయాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. హాసీనా డెలివరీ డేట్ దగ్గర పడడంతో మళ్ళీ కడుపునొప్పి వచ్చింది. ఈ కడుపునొప్పి కారణంగా ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు భర్త అమీర్.

ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఆమెను పరీక్షించి హాసీనా గర్భవతి కాదని తేల్చి చెప్పారు. కడుపులో కణితి కారణంగానే ఆమెకు కడుుపులో నొప్పి వస్తోందని ఆమె చెప్పారు.ఆపరేషన్ చేసి డాక్టర్లు కణితిని తొలగించారు. గర్భవతి కాకున్నా తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై హాసీనా దంపతులు కేసు పెట్టారు. తొలుత గర్భం దాల్చిన లక్షణాలే కన్పించాయని ప్రభుత్వ వైద్యులుచెప్పారు.

English summary
ameer marrage with haseena before seven years. they dont have children. one day haseena get stomach pain. ameer shifted in to chennai tripliclane hospital.doctors examined haseena,confirmed they she is pregnent.a tumor also in haseena stomach , so surgerey essential said doctors. every month came for treatment.on nov 18 is the delivery date, before delivery date haseena get stomach pain. ameer shifted to haseena a private hospital.doctors examined , she is not pregnent said doctors.doctors conduct surgery to haseena for remove the tumor.haseena couple complient against the triplicane hospital doctors about pregnancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X