దళితుల్ని మనుషులుగా చూడరు - ఇది సిగ్గుపడాల్సిన వాస్తవం - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఎన్‌కౌంటర్లలో చనిపోయిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీల మృతదేహాలను సైతం సొంత కుటుంబీకులకు అప్పగించడం రివాజు. కానీ హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటనలో మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడం, కుటుంబీకులు లేకుండానే, బాధిత యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చేసి, మరుసటి రోజు నుంచి 'అసలు రేప్ జరగనేలేదు..' అని కొత్త వాదన తెరపైకి తేవడం వివాదాస్పదమైంది. బాదితురాలు, ఆమె కుటుంబం పట్ల యూపీ సర్కారు ఇంత దారుణంగా వ్యవహరించడానికి గల కారణాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ ఆక్రోశం
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లా బుల్ గడీ గ్రామంలో 19 ఏళ్ల దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులాల యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెపై శాచిక దాడి చేయడం, సరైన చికిత్స అందక ఆమె గత నెల 29న చనిపోవడం, రాత్రికి రాత్రే పోలీసులు మృతదేహాన్ని తగులబెట్టడం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగగా, ఈ దాష్టీకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బాధితురాలు స్వయంగా తన పట్ల జరిగిన అకృత్యంపై సాక్ష్యం చెప్పినా, అక్కడేమీ జరగలేదన్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, ఆ రాష్ట్ర పోలీసులు, అధికారులు చెబుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆక్రోశం వెళ్లగక్కారు.

ఇదీ వాస్తవం..
మన దేశంలో చాలా మంది.. దళితులు, ఆదివాసీలు, ముస్లింలను అసలు మనుషులుగా పరిగణించడంలేదని, ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన వాస్తవం అని రాహుల్ గాంధీ అన్నారు. హాథ్రస్ బాధితురాలు దళిత కుటుంబానికి చెందినది కావడం వల్లే ఆమె ఎవరికీ పట్టనిదిగా ఉందన్నారు. ‘‘బాధితురాలే స్వయంగా తనపై అత్యాచారం జరిగిందని చెబితే.. పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు చెబుతున్నారు. అత్యాచారానికి గురైంది దళిత యువతి కాబట్టి ఆమెను ఎవరూ లెక్కచేయడంలేదు. మన దేశంలో చాలా మంది.. దళితులు, గిరిజనులు, ముస్లింలను అసలు మనుషులుగా చూడరు'' అని కాంగ్రెస్ నేత ఆవేదన వెలిబుచ్చారు.
Recommended Video

నిందితులకు అండదండలు..
హాథ్రస్ గ్యాంగ్ రేస్ కేసులో మృతురాలి శవాన్ని తగుల బెట్టిందేకాక, ఐదు రోజులపాటు మీడియాను గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం, బాధిత కుటుంబాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్న వీడియో బయటకి రావడం సంచలనం రేపాయి. ఇది చాలదన్నట్లు, హత్యాచారంతో తమకు సంబంధం లేదంటూ జైలులో ఉన్న నలుగురు నిందితులూ ఓ లేఖ రాయడం, యువతి తల్లి, సోదరులే ఆమెను చంపేశారని రివర్స్ లో ఆరోపణలు చేయడం కీలకంగా మారింది. అధికారుల అండదండలతోనే సదరు లేఖ బహిర్గతమైనట్లు తెలుస్తోంది. నిందితులకు మద్దతుగా బీజేపీ నేతల సమక్షంలో అగ్ర కులాలు పంచాయితీలు నిర్వహించడం, తమ వాళ్లను కాపాడుకుంటామని తీర్మానాలు చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications