Sheena Bora Case : సీబీఐ సంచలన నిర్ణయం-కేసు నూసేస్తున్నట్లు ప్రత్యేక కోర్టుకు వెల్లడి
2012లో ముంబైలో జరిగిన 24 ఏళ్ల యువతి షీనా బోరా హత్య కేసులో తాజాగా మరో సంచలన పరిణామం చోటు చోసుకుంది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ కేసులో మీడియా సంస్ధల అధిపతులైన పీటర్ ముకర్జియా, ఆయన భార్య ఇంద్రాణీ ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజయ్ ఖన్నా పాత్ర ఉన్నట్లు సీబీఐ గతంలోనే తేల్చింది. అయితే ఈ కేసులో సీబీఐ తాజా నిర్ణయం కలకలం రేపుతోంది.
2015లో వెలుగుచూసిన షీనా బోరా హత్య కేసు హై ప్రొఫెల్ కేసుల్లో ఒకటిగా మారింది. దీని దర్యాప్తును అప్పట్లో ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు చేసిన సీబీఐ.. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా.. తన తొలి, రెండో భర్తలు సంజయ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్ సాయంతో షీనాబోరాను హతమార్చినట్లు తేల్చింది. ఆ తర్వాత షీనా బోరా మృతదేహాన్ని సమీపంలోని రాయగడ జిల్లా అడవుల్లో కాల్చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనాలు రేపింది. సీబీఐ తీవ్రంగా కష్టపడి ఈ వ్యవహారాన్ని నిరూపించగలిగింది.

Recommended Video
ఈ కేసులో అప్పటి న్యూస్ ఎక్స్ ఛానల్ అధిపతులైన ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాల పాత్ర ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసిన సీబీఐ జైలుకు పంపింది. ఆ తర్వాత పీటర్ ముఖర్జియా బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే ఇంద్రాణితో పాటు ఆమె మొదటిభర్త, షీనా తండ్రి అయిన సంజయ్ ఖన్నా కూడా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తికావడం, నిందితులందరినీ కోర్టులో దోషులుగా నిరూపించడంతో ఈ కేసులో దర్యాప్తు ముగిసినట్లేనని సీబీఐ చెబుతోంది. దీంతో ముంబైలోని ప్రత్యేక కోర్టులో తదుపరి దర్యాప్తును ముగిసిస్తున్నట్లు సీబీఐ వెల్డడించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఇంద్రాణి ముఖర్జియా తన రెండే భర్త పీటర్ ముఖర్జియాకు విడాకులు కూడా ఇచ్చేసింది.












Click it and Unblock the Notifications