ఇంద్రాణిని పోలీసులు కొడుతున్నారు: లాయర్లు

ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియాను పోలీసులు కస్టడీలో కొడుతున్నారని ఆమె తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు.

ఆ విషయంపై న్యాయవాదులు పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఫిర్యాదు చేసినట్లు ఓ టీవీ చానెల్‌లో వార్త వచ్చింది. నేరాన్ని ఒప్పుకోవాలని ఆమెపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు.

కాగా, సంజీవ్ ఖన్నా కూతురు విధీ ముంబై కోర్టుకు వచ్చారు. షీలా హత్య కేసులో పోలీసులు ఇంద్రాణితో పాటు ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్, సంజీవ్ ఖన్నాలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, తనను మూడు సార్లు చంపడానికి ఇంద్రాణి ప్రయత్నించినట్లు మిఖాయిల్ బొరా ఆరోపించారు.

 Sheena Bora murder case: Indrani Mukerjea was slapped in custody, claim lawyers

2012 ఏప్రిల్ 24వ తేదీన సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి షీనాను కలవడానికి ముందు తనకు మత్తు మందు ఇచ్చారని, అయితే తాను తప్పించుకున్నానని ఆయన అంటున్నారు. ముంబైలోని వొర్లి ఏరియాలో ఇంద్రాణి, పీటర్ ముఖార్జియా నివాసంలో పోలీసులు ఓ సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. తనను చంపాలనే కుట్ర చేశారనే మిఖాయిల్ ఆరోపణకు అది బలం చేకూరుస్తోందని అంటున్నారు.

షీనాను చంపిన అటవీ ప్రాంతానికి పోలీసులు ఆదివారంనాడు సంజీవ్, ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను తీసుకుని వెళ్లి హత్య జరిగిన తీరును పరిశోధించారు. శనివారంనాడు పోలీసు విచారణలో సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి పరస్పరం హత్యకు సంబంధించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+