షీనా హత్య: పీటర్, ఇంద్రాణి రూ.275 కోట్ల మళ్లింపు?
న్యూఢిల్లీ: ముంబైలో సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసు మరో అనూహ్యమైన మలుపు తిరిగింది. షీనా బొరా తల్లి ఇంద్రాణి ముఖార్జియా, పీటర్ ముఖార్జియా రూ.275 కోట్ల మేరకు తమ కంపెనీ ఐఎన్ఎక్స్ మీడియా ద్వారా మళ్లించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) నివేదిక తెలిపింది.
హిందూలో ప్రచురితమైన ఆ నివేదిక ప్రకారం - మార్షియస్‌లోని పోర్ట్ లూయిస్‌లో గల బాటుకపు కంపెనీల ద్వారా ఐఎన్ఎక్స్ మీడియాలోకి ఇరువురు పెట్టుబడులు మళ్లించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఎనిమిది అనుబంధ కంపెనీల ద్వారా 2007, 2008 మధ్య కాలంలో మనీ లాండరింగ్ జరిగింది.

సిడిబిటి దర్యాప్తు విభాగంలోని కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఆదాయం పన్నుల డైరెక్టర్ జనరల్‌కు నిరుడు మే 5వ తేదీన నివేదికను సమర్పించారు. 2008-09లో ఐఎన్ఎక్స్ మీడియా రూ.270 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించడం గమనార్హం.
న్యూ వెర్నానా ప్రైవేట్ ఈక్విటీ లిమిటెడ్ ద్వారా రూ.28.37 కోట్లు, న్యూ సిల్క్ రూట్ ద్వారా రూ.89.85 కోట్లు, డన ఎర్న్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.89.40 కోట్ల లావాదేవీలు జరిపారు. షీనా బొరా హత్య కేసులో ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖార్జియాను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications