అతనితో టచ్‌లో ఇంద్రానీ: షీనాకీ తెలుసు, సీక్రెట్ ఇదేనా

ముంబై: తన తల్లి ఇంద్రానీ ముఖార్జియా తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో సంబంధం కొనసాగిస్తున్న విషయం ఇంద్రానీ కూతురు షీనా బోరాకు తెలుసని తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత కూడా సంజీవ్‌తో ఇంద్రానీ సంబంధాలు కొనసాగించడం కూడా హత్యకు ఓ కారణంగా అనుమానిస్తున్నారు. ఇది మరో కోణం.

షాకింగ్ ఏమంటే... షీనా హత్య తర్వాత కూడా ఆమె బతికి ఉంది అని చెప్పేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంటును ఇంద్రానీ, ఇతరులు ఉపయోగించుకున్నారు. షీనా స్నేహితులు, కుటుంబ సభ్యులు, షీనాతో రిలేషన్ షిప్ కలిగిన రాహుల్ తదితరులతోను నిత్యం సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నారు.

తద్వారా షీనా బతికే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. సంజీవ్ ఖన్నాతో ఇంద్రానీ సంబంధాలు కొనసాగించడం హత్యకు ఓ కారణంగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి షీనా సోదరుడు మిఖాయిల్ పోలీసులకు ఓ క్లూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Sheena knew Indrani Mukerjea was in touch with former husband

ఆ వాస్తవం ఇదేనా?

షీనా హత్యకు అసలు కారణం తనకు తెలుసునని, దానిని తన తల్లి చెప్పాలని లేదంటే తానే బయటపెడతానని మిఖాయిల్ హెచ్చరించిన విషయం తెలిసిందే. సంజీవ్ ఖన్నాతో ఇంద్రాణి గుట్టుయే ఆ రహస్యం కావొచ్చని భావిస్తున్నారు.

షీనా మంచి అమ్మాయి

సొంత తల్లి, మారు తండ్రి చేతిలో హత్యకు గురైన షీనా బోరా గురించిన మరింత సమాచారం వెలుగులోకి వస్తోంది. ఆమె ముంబైలో ఎకనామిక్స్ చదివిన సెయింట్ జేవియర్స్ కాలేజీ విద్యార్థినులు తమ ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా షీనా గురించిన వివరాలు, ఆమెతో దిగిన చిత్రాలను పోస్ట్ చేశారు.

Sheena knew Indrani Mukerjea was in touch with former husband

ఆమె చాలా మంచి అమ్మాయి అని, చదువు పట్ల ఎప్పుడూ అంకితభావంతో ఉండేదని, అమాయకురాలని, ఎన్నడూ క్లాసులు ఎగ్గొట్టి ఎరుగదని చెప్పారు. చిన్న పిల్లల మనస్తత్వాన్ని ప్రదర్శించే షీనా తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాత్రమే చెప్పేదని, అంతకు మించిన విషయాలను చర్చించేందుకు ఇష్టపడేది కాదన్నారు.

ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు షీనా ప్రయత్నించేదని, ఫ్యాషన్ అంటే ఇష్టమని, స్నేహం చేసింది తక్కువమందితో అయినా వారితో బాగా కలిసి పోయిందని పోస్టులు పెట్టారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పని గంటలు అధికంగా ఉన్నాయని, కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పేదన్నారు.

ఆమె రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రెండేళ్లు ట్రయినీగా పని చేసిందని, ఆపై ముంబై మెట్రో వన్‌లో, అనంతరం రిలయన్స్ అడాగ్ గ్రూప్‌లో హెచ్ఆర్ విభాగం అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా పని చేసిందని సమాచారం.

Sheena knew Indrani Mukerjea was in touch with former husband

షీనాకు లగ్జరీ ఆశలు చూపి తీసుకెళ్లిన ఇంద్రానీ

తాతయ్య, అమ్మమ్మల వద్ద పెరిగిన షీనా.. తన తల్లి ఫోటోను స్నేహితులకు చూపిస్తూ.. చూడండి, మా అమ్మ ఎంత అందంగా ఉందో అంటూ మురిపెంగా చెప్పుకునేది. అలాంటి స్థితిలో ఉన్న షీనా బోరాకు అమ్మ ఇంద్రాణి దగ్గరైంది. బతుకుపై ఎన్నో ఆశలు చూపింది. గతంలో తాను తప్పు చేశానని బాధపడింది.

ఇప్పుడు తాను బాగున్నానని, తనతో రావాలని చెప్పింది. చదివిస్తానని చెప్పింది. ఇది షీనా చిన్ననాటి స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.

ఆమె చాలా తెలివి గల అమ్మాయని ఆర్ట్స్, మ్యూజిక్ అంటే ఆసక్తిని చూపేదని, తొమ్మిదో తరగతి తర్వాత పరిస్థితి మారిపోయిందని, ఆమె నివాసం ఉంటున్న ఇల్లు మారిపోయిందని, కొత్త కార్లు వచ్చి చేరాయని, విదేశాలకు టూర్లు వేసిందన్నారు. మధ్య తరగతి బతుకుల్లోకి వచ్చి లగ్జరీ ఆశలు చూపి షీనాను తల్లి ఇంద్రానీనీ తీసుకు వెళ్లిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+