హస్తినలో నీరు, కరెంట్ కష్టాలు .. సమస్య తీర్చాలని కేజ్రీతో షీలా డిమాండ్
న్యూఢిల్లీ : భానుడి భగ భగలు ఇంకా తగ్గలేదు. దీంతో కొన్నిప్రాంతాల్లో నీటి కొరత మరింత ఎక్కువైంది. ఇక రాజధాని నగరం ఢిల్లీలో నీటితోపాటు కరెంట్ కష్టాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సరఫరా చేస్తున్నారు .. కానీ ... చార్జీలు పెంచడంతో హస్తనగరి వామ్మో అంటున్నాడు. ఈ నేపథ్యంలో చార్జీల పెంపుపై పునరాలోచించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దృష్టికి తీసుకొచ్చారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్.
నీటి కట కట
ఢిల్లీలో మంచినీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. నీటి కటకట కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరాతీశారు షీలా దీక్షిత్. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నగర ప్రజలను కరెంట్, మంచినీటి కష్టాలు ఎక్కువయ్యాయని వివరించారు. అంతేకాదు కరెంట్ బిల్లుపై ఫిక్స్‌డ్ చార్జీ వెనక్కి తీసుకోవాలని షీలా దీక్షిత్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో కన్నా చార్జీలు తగ్గిస్తానని షీలా దీక్షిత్‌కు హామీనిచ్చినట్టు సమాచారం.

మారిన స్వరం ..
సమావేశం ముగిసాక ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సమస్యలను సీఎం కేజ్రీవాల్ దృష్టికి షీలాదీక్షిత్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సీఎం కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో చార్జీల తగ్గింపు, యాథాతథ స్థితి గురించి స్పస్టమైన హామీని కేజ్రీవాల్ ఇవ్వలేదని చెప్పారు.
దీంతో గంటల వ్యవధిలోనే కాంగ్రెస్, ఆప్ నేతల మాటల్లో తేడా కనిపిస్తోంది. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మంచినీరు ప్రజలకు కేటాయించాల్సి ఉంది. అలాగే విద్యుత్ చార్జీ ఫిక్స్‌డ్ చార్జీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి షీలా దీక్షిత్ ప్రతిపాదన కూడా జనం బాగుకోరి చేశారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications