ఇండస్ట్రీలోని పెళ్లైన భర్తలు, అతను: నటి శిఖా ఆత్మహత్యలో కొత్తకోణం

ముంబై: బీఏ పాస్ ఫేం బాలీవుడ్ నటి శిఖా జోషీ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె బాత్‌రూంలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె మరణించే ముందు ఆమె స్నేహితురాలు, రూమ్మేట్ అయిన మధు ఓ వీడియో తీసింది.

ఆ వీడియోలో శిఖా జోషి.. తన మరణానికి ఓ కాస్మెటిక్ సర్జన్, బాలీవుడ్‌లోని పలువురు పెళ్లైన పురుషులు కారణమని ఆ వీడియోలో ఆరోపించింది. పోలీసులు ఆ వీడియోను పరిశీలిస్తున్నారు. శిఖా నాలుగేళ్ల క్రితం సదరు సర్జన్ పైన వేధింపుల కేసు పెట్టింది. అనంతరం రెండేళ్ల క్రితం ఆయన ఇంటి పైన రాళ్లు విసిరిన కేసులో ఇరుక్కుంది.

Shikha Joshi's dying statement names people responsible for death

ఆమె వద్ద ఇంటికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేవని, ఢిల్లీకి వెళ్లేందుకు టిక్కెట్ డబ్బు కోసం సెల్‌ఫోన్ అమ్మేందుకు సిద్ధపడిందని స్నేహితురాలు మధుభారతి వివరించారు. శిఖా ఆత్మహత్య సమయంలో తాను ఒక్కదానినే ఉన్నందున, ముందు జాగ్రత్తగా తనతో మాట్లాడి ఈ వీడియోను తీసినట్లు చెప్పింది.

ఆంగ్ల పత్రికతో శిఖా జోషి స్నేహితురాలు మధు మాట్లాడుతూ.. తన భర్త, తన ఫ్రెండ్, శిఖాలు శనివారం సాయంత్రం చాటింగ్ చేస్తున్నామని, ఆ తర్వాత తాను నిద్రపోయానని చెప్పింది. తాను సాయంత్రం ఐదు నలభై అయిదు నిమిషాలకు నిద్ర లేచానని, ఆ సమయంలో తన భర్త వర్క్ పైన బయటకు వెళ్లాడని తెలిపింది.

ఆ సమయంలో తాను బాత్ రూంలో నుండి శబ్దాలు విన్నానని, అప్పుడు తలుపు తట్టానని, శిఖా సమాధానం ఇవ్వలేదని చెప్పింది. తాను పదేపదే డోర్ పైన కొట్టానని చెప్పింది. ఆ తర్వాత ఆమెను కోకిలాబెన్ అంబాని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దానికి ముందే మధు సూసైడ్ స్టేట్‌మెంట్ తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+