• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత తొలిసారి శిల్పాశెట్టి పోస్ట్ .. అందరూ ఆలోచించేలా !!

|

నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు, ఐపీఎల్ లు పెద్దగా కలిసి రాకపోవడంతో తప్పుదారిలో సంపాదన కోసం రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ను కొన్ని యాప్ ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నట్లుగా, ఈ పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే ప్రధాన సూత్రధారిగా పోలీసులు ప్రాధమికంగానిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు దర్యాప్తు .. హెచ్ అకౌంట్ లావాదేవీలు, చిన్న సంస్థలతో 70 పోర్న్ వీడియోలు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు దర్యాప్తు .. హెచ్ అకౌంట్ లావాదేవీలు, చిన్న సంస్థలతో 70 పోర్న్ వీడియోలు

ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిన శిల్పాశెట్టి

ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిన శిల్పాశెట్టి

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ కేసులో శిల్పా శెట్టి పాత్ర కూడా ఉందా అని జరిగిన చర్చకు పోలీసులు సమాధానం ఫుల్ స్టాప్ పెట్టగా, భర్త వ్యవహారం పై శిల్పా శెట్టి ఎలా స్పందిస్తారు అనేది గత నాలుగు రోజులుగా బాలీవుడ్ వర్గాలతో పాటుగా, ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్న్ రాకెట్ కేసులో నిన్నటి వరకు మౌనం వహించిన శిల్పా శెట్టి నిన్న రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఆసక్తికరమైన స్టోరీ

సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఆసక్తికరమైన స్టోరీ

అందరినీ ఆలోచింపజేసేలా శిల్పా శెట్టి చేసిన పోస్ట్ ఆమె సహనానికి అద్దం పట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రముఖ రచయిత జేమ్స్ ధర్భర్ నవలలోని ఒక పేరాని కోట్ చేస్తూ సాగింది. శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా సవాళ్లను ఎదుర్కోవడం గురించి మాట్లాడారు. కోపం తో వెనక్కి తిరిగి చూడకు, భయంతో ముందుకు వెళ్ళకు, కానీ చుట్టూ చూస్తూ చైతన్యంతో ముందుకు సాగు అంటూ ఓ కోట్ ను ఉదహరించిన ఆమె, మనల్ని బాధ పెట్టిన వారిపై ఒక్కొక్కసారి తీవ్ర అసహనంతో కోపాన్ని వ్యక్తం చేస్తామని, మన దురదృష్టానికి నిందించుకుంటామని, ఇదే సమయంలో భయంతో ముందుకు వెళితే చెయ్యాల్సిన పని చేయలేకపోవడమే కాకుండా, అనారోగ్యం బారిన పడి ప్రియమైన వారికి దూరం అవుతామని పేర్కొన్నారు.

బ్రతికి ఉండటమే అదృష్టం .. సవాళ్ళను ఎదుర్కొంటూ నా జీవితాన్ని జీవిస్తాను

బ్రతికి ఉండటమే అదృష్టం .. సవాళ్ళను ఎదుర్కొంటూ నా జీవితాన్ని జీవిస్తాను


అంతేకాదు ఇప్పుడు ఆందోళనతో ఏదీ సాధించలేము అని పేర్కొన్న శిల్పాశెట్టి, చైతన్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో సజీవంగా ఉండటం అదృష్టమని తెలుసుకొని నేను ఊపిరి పీల్చుకున్నానన్నారు. అంతేకాదు తాను గతంలో సవాళ్లను తట్టుకున్నానని, ఎదుర్కొన్నానని, భవిష్యత్తులో సైతం సవాళ్లను తట్టుకోగలను అని పేర్కొన్న శిల్పాశెట్టి ఇది నా జీవితం, తనను జీవించటం నుండి ఎవరు వేరు చేయలేరు అని ,ఎలాంటి పరిస్థితులు నన్ను ఏమి చెయ్యలేవు అని అందరూ ఆలోచించేలా పోస్ట్ చేశారు.

  Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
  శిల్పా మెంటల్ ఫిట్నెస్ నెక్స్ట్ లెవల్ .. కుంద్రా వ్యవహారంపై సైలెంట్

  శిల్పా మెంటల్ ఫిట్నెస్ నెక్స్ట్ లెవల్ .. కుంద్రా వ్యవహారంపై సైలెంట్


  గత నాలుగు రోజులుగా మౌనంగా ఉన్న శిల్పాశెట్టి తాజాగా పెట్టిన ఇంస్టాగ్రామ్ స్టోరీ యోగ మాస్టర్ శిల్పాశెట్టి ఫిజికల్ ఫిట్నెస్ నే కాదు, మెంటల్ ఫిట్ నెస్ కు అద్దం పడుతుంది. ఆమె ఎలా స్పందిస్తుందో అని చూసిన వారంతా శిల్పా శెట్టి పోస్ట్ తో ఆమె మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు తన భర్త రాజ్ కుంద్రాపై నమోదైన కేసుపై శిల్పాశెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గమనార్హం.

  English summary
  Actress Shilpa Shetty, late on Thursday night, shared a cryptic Instagram story, which appears to be a page out of one of author James Thurber's books. Shilpa Shetty's Instagram story arrives days after her husband Raj Kundra was arrested in a case involving pornographic filmmaking.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X