రాజ్ కుంద్రాకు సపోర్ట్ గా శిల్పాశెట్టి..ఆయన తీసినవి పోర్న్ వీడియోలు కాదు: పోలీసులకు వాంగ్మూలం

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసుకు సంబంధించి విచారణ జరిపిన ముంబై కోర్టు శుక్రవారం వ్యాపారవేత్త మరియు అతని సహచరుడు రియాన్ తోర్పేను జూలై 27 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు జులై 23న శిల్పాశెట్టి వాంగ్మూలం నమోదు చేశారు. అదే రోజు వారి జుహు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు జరిపారు.

Recommended Video

    Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Oneindia Telugu
    తన భర్త ఎలాంటి పోర్నోగ్రఫీ కంటెంట్ తయారీలో పాల్గొనలేదన్న శిల్పాశెట్టి

    తన భర్త ఎలాంటి పోర్నోగ్రఫీ కంటెంట్ తయారీలో పాల్గొనలేదన్న శిల్పాశెట్టి

    రాజ్ కుంద్రా యొక్క హాట్ షాట్ యాప్ కు సంబంధించి తనకు సంబంధం ఉందన్న విషయాన్ని నటి శిల్పాశెట్టి ఖండించినట్లు పోలీసుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో తన భర్త రాజ్ కుంద్రాకు నటి శిల్పాశెట్టి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎరోటికా పోర్న్ కంటే భిన్నమైనదని, తన భర్త ఎలాంటి పోర్నోగ్రఫీ కంటెంట్ తయారీలో పాల్గొనలేదని ఆమె తన భర్తకు మద్దతు ఇచ్చిందని తెలుస్తుంది. ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్ల నుండి 'మరింత అశ్లీలమైన' ఉదాహరణలను చూపిస్తూ, కుంద్రా యొక్క యాప్ హాట్‌షాట్‌లో లభించే సినిమాలు 'అశ్లీలత కాదని దర్యాప్తు బృందానికి తన ప్రకటనను రికార్డ్ చేస్తున్నప్పుడు శిల్పా పేర్కొన్నట్లు తెలిసింది.

    శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల నివాసంలో సోదాలు .. హార్డ్ డిస్క్ మరియు కంప్యూటర్ స్వాధీనం

    శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల నివాసంలో సోదాలు .. హార్డ్ డిస్క్ మరియు కంప్యూటర్ స్వాధీనం

    శిల్పా శెట్టి రాజ్ కుంద్రా ల నివాసం వద్ద సోదాలు నిర్వహించిన తర్వాత అధికారులు హార్డ్ డిస్క్ మరియు కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారని నివేదిక సూచించింది. రాజ్ కుంద్రా యాజమాన్యంలోని వయాన్ ఇండస్ట్రీస్‌కు ఎందుకు రాజీనామా చేశారని శిల్పాశెట్టి ని పోలీసులు ప్రశ్నించారు. మూడు గంటలపాటు శిల్పా శెట్టిని విచారించిన పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేశారు . ఇక బాలీవుడ్ పోర్నోగ్రఫీ కేసు ఫిబ్రవరిలోనే నమోదుకాగా, తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా అరెస్టుతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

    రాజ్ కుంద్రా నేరం చేశారని ఆధారాలున్నాయన్న పోలీసులు .. భర్తకు సంబంధం లేదన్న శిల్పా శెట్టి

    రాజ్ కుంద్రా నేరం చేశారని ఆధారాలున్నాయన్న పోలీసులు .. భర్తకు సంబంధం లేదన్న శిల్పా శెట్టి

    ఒక పక్క పోలీసులు రాజ్ కుంద్రా మోడల్స్ ను బెదిరించి పోర్న్ వీడియోలు తీసి, హాట్ షాట్ యాప్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లారని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్తుండగా, తన భర్త ఎలాంటి అశ్లీల కంటెంట్ను ప్రొడ్యూస్ చేయలేదని, ఎరోటికాకు , పోర్న్ కు వ్యత్యాసం ఉంటుందని శిల్పా శెట్టి చెప్పినట్లుగా సమాచారం. ఇక తాజాగా శిల్పా శెట్టిని విచారించటం, వారి ఇంట్లో పోలీసులు సోదాలు చెయ్యటంతో శిల్పాశెట్టి కూడా ఈ కేసులో ఇరుక్కుంటారా ? అని బాలీవుడ్ వర్గాలలో చర్చ జోరుగా సాగుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+