షాక్: గ్యాంగ్ రేప్ చేశాడని తీసుకొచ్చి సెల్ లో పెడితే.. మళ్లీ అక్కడ.., ఆ తరువాత ఏం జరిగిందంటే...
బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్‌లో ఉంచితే.. అతడు పోలీసుల సమక్షంలో మరో ఘాతుకానికి ఒడికట్టాడు. అనంతరం తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సిమ్లా: బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్‌లో ఉంచితే.. అతడు పోలీసుల సమక్షంలో మరో ఘాతుకానికి ఒడికట్టాడు.
సిమ్లా లోని కోట్‌ఖాయీ ప్రాంతానికి చెందిన బాలిక(16) పదో తరగతి చదువుతోంది. ఈమె ఈనెల 4న అదృశ్యమైంది. రెండు రోజుల అనంతరం ఆ బాలిక మృతదేహం పోలీసులకు లభ్యమైంది.

అత్యాచారం, ఆపైన హత్య...
మృతదేహాన్ని శవపరీక్షకు పంపగా ఆ బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని, అనంతరం దుండగులు ఆమెను చంపేశారని తేలింది. బాలికపై సామూహిక అత్యాచారానికి నిరసనగా స్థానికులు ఆందోళన చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

లాకప్ లోనే డిష్యూం.. డిష్యూం..
ఈ కేసులో నిందితుడైన రాజేంద్ర సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని స్టేషన్ కు తరలించి, లాకప్ లో ఉంచారు. ఇతడిని ఉంచిన లాకప్ లోనే అప్పటికే అదే కేసులో అరెస్టయిన సూరత్ సింగ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక్కడే పోలీసులు పొరపాటు చేశారు. అందరినీ విడివిడిగా లాకప్ లలో ఉంచకుండా మొత్తాన్ని రెండు లాకప్ లలో ఉంచారు.

పోలీస్ స్టేషన్ లోనే హత్య?
పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉన్న సూరత్ సింగ్ ను చూడగానే రాజేంద్ర సింగ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆర్థరాత్రి సమయంలో రాజేంద్ర, సూరత్ లాకప్ లోనే గొడవ పడ్డారు. రాజేంద్ర ఆగ్రహం పట్టలేక సూరత్ ను కొట్టి చంపేశాడు. ఇది గమనించిన పోలీసులు సూరత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు.
రెచ్చిపోయిన జనం, పోలీస్ స్టేషన్ కు నిప్పు...
సూరత్ సింగ్ లాకప్ డెత్ విషయం ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న జనం రెచ్చిపోయారు. మధ్యాహ్నం ప్రాంతంలో దాదాపు 3 వేల మంది పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఆ తరువాత ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు కోట్‌ఖాయీ పోలీస్ స్టేషన్ మీద రాళ్లు రువ్వారు. అంతటితో ఈ గొడవ ఆగలేదు. పోలీసు వాహనానికి నిప్పటింటించడమే కాక, నలుగురు పోలీసులను కూడా నిర్బంధించారు.
సీఎం సీరియస్.. అందరూ సస్పెండ్...
ఈ విషయం కాస్తా సీఎం వరకు వెళ్లడంతో.. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విధి నిర్వహణలో విఫలమవడమే కాక, ఇంత విధ్వంసం జరగడానికి కారణమైనందుకు కోట్‌ఖాయీ పోలీసు స్టేషన్‌లోని సీఐ, ఎస్పైలతో సహా సిబ్బందినంతా సస్పెండ్ చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications