గుజరాత్ లో అడుగుపెట్టిన జపాన్ ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ
జపాన్ ప్రధాని షింజో అబె రెండు రోజుల గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి వచ్చిన అబెకు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.
అహ్మదాబాద్: జపాన్ ప్రధాని షింజో అబె రెండు రోజుల గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి వచ్చిన అబెకు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.
విమానం దిగగానే అబెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోడీ. ఇద్దరు నేతలు అక్కడి నుంచి నేరుగా రోడ్ షో నిర్వహించి మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు . జపాన్ ప్రధాని షింజో అబెకు 9 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది స్వాగతం పలికారు.
Japanese PM Shinzo Abe, his wife Akie Abe and PM Narendra Modi at Sabarmati Ashram in Ahmedabad. pic.twitter.com/I6yPNEqvCj
— ANI (@ANI) September 13, 2017
డప్పులు, నృత్యాలతో సాంప్రదాయ రీతిలో ఇరు దేశాల ప్రధానులను గ్రీట్ చేశారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆశ్రమ విశేషాలను మోడీ.. అబెకు వివరించారు.
PM Modi & Japanese PM Shinzo Abe's road show to Sabarmati Ashram in Ahmedabad, begins. pic.twitter.com/QJGpkIkdVg
— ANI (@ANI) September 13, 2017
విమానం దిగే సమయంలో సూట్ వేసుకొని కనిపించిన అబె.. ఓపెన్ టాప్ జీపులో మాత్రం భారత సాంప్రదాయ కుర్తాలో కనిపించడం విశేషం. అబె ఇండియాకు రావడం ఇది నాలుగోసారి. మోడీ ఇవాళ రాత్రి అబెకు ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.
#WATCH: PM Narendra Modi receives Japanese PM Shinzo Abe & his wife Akie Abe at Ahmedabad Airport. pic.twitter.com/Sui3i6jYdi
— ANI (@ANI) September 13, 2017
Gujarat: PM Narendra Modi receives Japanese PM Shinzo Abe and his wife Akie Abe at Ahmedabad Airport. pic.twitter.com/0ZOAROdDaN
— ANI (@ANI) September 13, 2017
తన ఫేవరెట్ వంటకాలతో జపాన్ ప్రధానికి విందు ఇవ్వనున్నారు. రేపు షింజో అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్ సాయంతో రానున్న ఈ బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications