వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shinzo Abe : షింజో అబేను అందుకే కాల్చేశా- పోలీసుల విచారణలో షూటర్ షాకింగ్ రీజన్

|
Google Oneindia TeluguNews

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇవాళ ఉదయం ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ వ్యక్తి ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో అబేపై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇందులో షూటర్ ఈ హత్య వెనుక కారణాలు వెల్లడించాడు.

షింజో అబేను కాల్చి చంపిన షూటర్.. 41 ఏళ్ల, జపనీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ సభ్యుడిగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో తయారు చేసిన తుపాకీతో అబేపై అతను కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ఇంట్లో పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. షింజో అబే పశ్చిమ నగరం నారాలోని ఒక రైల్వే స్టేషన్ వెలుపల ప్రసంగిస్తుండగా... బుల్లెట్ తో రెండుసార్లు కాల్పులు జరిగాయి. బూడిదరంగు టీ-షర్టు, లేత గోధుమరంగు ప్యాంటులో ఉన్న అనుమానితుడిని భద్రతా అధికారులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Shinzo Abe : Shooter Said Dissatisfied With him, told police after arrest

షింజో అబేపై కాల్పులు జరిపిన షూటర్ ఆయనపై అసంతృప్తితోనే కాల్పులు జరిగినట్లు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన విధానాలతో విభేదిస్తూ కాల్పులకు దిగినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో ఇంతకు మించిన కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న దానిపై పోలీసులు అతని స్నేహితులు, బంధువుల్ని గుర్తించి విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అబేపై కాల్పుల తర్వాత తీసిన ఫొటోల్లో.. ఆయన తెల్లటి చొక్కా మీద రక్తంతో, ఒక గార్డ్‌రైల్‌తో వీధిలో పడుకున్నట్లు కనిపించింది. అనంతరం ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఇందులో ఒకరు ఆయనకు హార్ట్ మసాజ్ చేస్తున్నారు.
వాస్తవంగా జపాన్ లో రాజకీయ హింస చాలా అరుదు. తుపాకీలను కఠినంగా నియంత్రించే దేశంగా పేరొందిన జపాన్ లో జరిగిన ఈ హత్యాయత్నం జపాన్ ప్రజలు, ప్రపంచ నాయకుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా కాల్పులను తీవ్రంగా ఖండించారు.

English summary
former japanese prime minister shinzo abe's shooter said that he was dissatisfied with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X