రాంమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలి.. ఉద్దవ్ థాక్రే

రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన యూపిలోని రాంమందిరాన్ని శివసేన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో కలిసి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడీయాతో మాట్లాడారు.

2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలోనే అయోధ్య ను సందర్శించానని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.కాగా ఇదివరకే ఉద్దవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించి రాంమందిర నిర్మాణం చేపట్టాని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు.

 Shiv Sena chief Uddhav Thackeray offered prayers at the makeshift Ram Lalla temple

ఇక తాజాగా మరోసారి అనగా నేడు 18మంది ఎంపీల బృందంతో కలిసి రామాలయాన్ని ఉద్దవ్ ఠాక్రే సందర్శించాడు.దీంతో రామమందిర నిర్మాణం చేపట్టాలని ప్రధానమంత్రి మోడీపై ఒత్తిడి తేనున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం రామ మందిర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. మందిరాన్ని నిర్మించాలని ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మరోవైపు మహరాష్ట్ర్రలో వచ్చే ఎన్నికలు ఉండడం కూడ శివసేన పావులు కదుపుతోంది.

కాగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో సైతం రామమందిర నిర్మాణం చేపడతామని పేర్కోంది. ఇక రామ మందిర నిర్మాణ వివాదం సుప్రిం కోర్టు ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే..మందిర నిర్మాణంపై మధ్యవర్తుల సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని కూడ కోర్టు సూచించింది. కాగా గత 50 సంవత్సరాల రాజకీయ చరిత్రను తిరగ రాసిన బీజేపీ స్వంతగానే 303 స్థానాలు సాధించింది. దీంతో ఆ పార్టీ రామ మందిర నిర్మాణంపై ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్దమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+