వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ నేతలు, మొఘల్ వారసులా...? భగ్గుమన్న శివసేన

|
Google Oneindia TeluguNews

ఈ నెల 7వ తేదిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదంటూ బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలకు శివసేన దీటుగా స్పందించింది. ఇది మొఘలులు జారీ చేసి ఫత్వాలాగా ఉందని అన్నారు. బీజేపీ చేస్తున్న ప్రకటనలు రాజ్యంగా విరుద్దమని, ప్రజాస్వామానికి వ్యతిరేకమని అన్నారు. రాష్ట్రపతి మీ జేబులో ఉన్నాడా అంటూ తన అధికార పత్రిక సామ్నాలో ఘాటుగా స్పందించింది.

రంజుగా ''మహా'' రాజకీయం: ఎన్సీపీ కాంగ్రెస్ సహకారంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు..?రంజుగా ''మహా'' రాజకీయం: ఎన్సీపీ కాంగ్రెస్ సహకారంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు..?

రెండు పార్టీల మధ్య పెరుగుతున్న గ్యాప్

రెండు పార్టీల మధ్య పెరుగుతున్న గ్యాప్

బీజేపీ శివసేనల మధ్య రోజురోజుకు మాటల యుద్దం పెరుగుతోంది. ఇన్నాళ్లు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలిని భావించినప్పటికి ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరం లేదు. ఒప్పందం ప్రకారం సీఎం పదవి తమకు కట్టబెట్టాలని శివసేన బెట్టుమీద ఉండడంతో బీజేపీ తన ప్రత్యామ్నాలపై ఫోకస్ చేసింది. దీంతో శివసేన సైతం బీజేపీకి సవాల్ విసురుతోంది. తాము లేకుండా ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందో వేచిచూసే ధోరణిలో శివసేన పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే సిద్దంతాలను పక్కన బెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు కదం తొక్కింది. దీంతో మహా రాజకీయాలు వెడెక్కాయి.

7వ తేది తర్వాత రాష్ట్రపతి పాలన...?

7వ తేది తర్వాత రాష్ట్రపతి పాలన...?

ఈ నేపథ్యంలోనే సీఎం సీటు సంపాదించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో శివసేనను నయాన భయాన తన దారికి తెచ్చుకునేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 7వ తేదిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందని. రాజ్యంగం ప్రకారం ఏడవతేదిన ప్రభుత్వం గడువు ముగియ నుండగా ఎనిమిదవ తేదీ నుండి కొత్త ప్రభుత్వం కొలువుదీరాలని బీజేపీ ఆర్ధిక మంత్రి సుధీర్ ముంగతీవార్ తెలిపారు. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలనకు కారణం ఎవరో తెల్చుకోవాలని ఆయన ఇన్‌డైరక్టుగా శివసేనపై విరుచుకుపడ్డారు.

బలం ఉంటే... ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు

బలం ఉంటే... ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు

బలం ఉందంటున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఎందుకు చేయడం లేదని శివసేన నేతలు ప్రశ్నించారు. తాము స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన వారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఎద్దేవా చేసింది. దీనికి మహారాష్ట్ర ప్రజలు ఎలా భాద్యత వహిస్తారని వారు తమ పత్రికలో పేర్కోన్నారు. సరైన మెజారిటి లేని వారు కూడ రాష్ట్రపతి పాలన విధిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇక బీజేపీ నేతలే ఎల్లప్పుడు పాలించాడనికి పుట్టినట్టు ఫీలవుతున్నారని, మెజారీటీ రాకపోయినా..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజల్లో తన పరువును పోగోట్టుకుంటుందని వ్యాఖ్యానించింది.

 సోనియా జోక్యం చేసుకోవాలంటూ లేఖ రాసిన ఎంపీ

సోనియా జోక్యం చేసుకోవాలంటూ లేఖ రాసిన ఎంపీ

మరోవైపు కాంగ్రెస్ ,ఎన్సీపీ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ హుస్సెన్ దాల్వాయి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అలోచన చేయాలని లేఖలో పేర్కోన్నారు. ఈ సంధర్భంగా శివసేన , బీజేపీ సిద్దంతాలు వేరని , బీజేపీ కంటే శివసేన చాల మెరుగని ఆయన పేర్కోన్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. దీంతోపాటు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎలాంటీ తప్పుకాదని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

English summary
Shiv Sena has reacted strongly to the state finance minister and BJP leader Sudhir Mungantiwar's demand for President's rule in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X