ఉద్ధవ్ థాకరే సెక్యూరిటీ అధికారిని కొట్టిన సేన ఎమ్మెల్యే

ముంబై: శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే భద్రతా సిబ్బందిలోని ఓ పోలీసు అధికారి పైన అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ చేయి చేసుకున్నాడు. అనంతరం అతను పరారయ్యాడు. మంత్రులతో బేటీలో ఉన్న ఉద్ధవ్‌నుకలుసుకునేందుకు హర్షవర్ధన్ జాదవ్ వచ్చారు. అయితే, ఆయనను భద్రతాధికారి లోనికి అనుమతించలేదు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో చేరిన తమ పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే బుధవారం భేటీ అయ్యారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎవరినీ కూడా అనుమతించవద్దని స్వయంగా ఉద్దవ్ థాకరేనే పోలీసులకు చెప్పారు.

Shiv Sena Lawmaker Allegedly Slaps Cop Who Was Part of Uddhav's Security Team

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే జాదవ్ వచ్చారు. తాను శాసనసభ్యుడినని, లోపలికి అనుమతించాల్సిందేనని అధికారిని కోరాడు. అయితే థాకరే ఆదేశాల కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించలేమని ఉద్ధవ్ వ్యక్తిగత సిబ్బందిలోని ఇన్‌స్పెక్టర్ పరాగ్ చెప్పారు.

దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఇన్‌స్పెక్టర్ పైన దాడి చేశారు. అనంతరం పరారయ్యాడు. కాగా, జాదవ్ కోసం థాకరే ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. దీంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండని ఆయన పోలీసులకు చెప్పేశారు. దీంతో జాదవ్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+