ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: రాజ్‌భవన్‌కు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి నివాసానికి చేరుకున్నారు. శివసేన నేతలు ఏకనాథ్ షిండే, సునీల్ ప్రభు, మిలింద్ నర్వేకర్ రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా ఉన్నారు. ఇప్పటికే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యేలు బాధ్యలు చేపడతారని, డిసెంబర్ 1న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు.

కాగా, శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి సరికొత్త పేరును పెట్టారు. మహా వికాస్ అఘాడి అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో పాటు పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని కూటమి నాయకులు వెల్లడించారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినందున.. దీనిపై ఎలాంటి చర్చలు లేవని తెలిపారు.
Mumbai: Congress-NCP-Shiv Sena leaders arrive at the Raj Bhavan. Shiv Sena chief Uddhav Thackeray has been elected as the CM candidate of 'Maha Vikas Aghadi'. #Maharashtra pic.twitter.com/E6DLrviVP6
— ANI (@ANI) November 26, 2019
మహా వికాస్ అఘాడి నేతగా, ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా తన పేరును ఏకగ్రీవంగా ఆమోదించిన వెంటనే ఉద్దవ్ థాకరే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఉద్వేగంతోనే ఆయన ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠిస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీతో 30 సంవత్సరాల పాటు కొనసాగిన మైత్రీ బంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications