వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ కండకావరం: ఎయిరిండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతోకొట్టాడు!

శివసేన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ తన కండకావరాన్ని మరోసారి చాటుకున్నాడు. త‌న‌కు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వ‌లేదంటూ ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శివసేన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ తన కండకావరాన్ని మరోసారి చాటుకున్నాడు. త‌న‌కు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వ‌లేదంటూ ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టారు. పుణె నుంచి న్యూఢిల్లీ వెళ్లే విమానం ఉద‌యం 11 గంట‌ల‌కు ల్యాండ‌వ‌గానే ఎంపీ.. ఉద్యోగిపై దాడికి దిగాడు.

అంతేగాక, త‌న చ‌ర్య‌ను ఆయ‌న స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. 25సార్లు చెప్పుతో కొట్టానని ఆయనే చెప్పుకొచ్చారు. 'అవును నేను అత‌న్ని కొట్టాను. అత‌ను నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడు' అని గైక్వాడ్ తెలిపాడు.

'నేను బిజినెస్ క్లాస్ టికెట్ కోసం డ‌బ్బు చెల్లించాను. ఇలా జ‌ర‌గ‌డం ఇది తొలిసారి కాదు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. దీంతో ఈసారి నేను స‌హ‌నాన్ని కోల్పోయాను. దాడి చేశాను' అని గైక్వాడ్ చెప్పారు.

ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీపై అశోక్ తీవ్ర ఆగ్రహం ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీపై అశోక్ తీవ్ర ఆగ్రహం

త‌న‌కు బిజినెస్ క్లాస్ సీట్ ఎందుకు ఇవ్వ‌లేద‌ని స‌ద‌రు ఉద్యోగితో ఎంపీ వాద‌న‌కు దిగారు. బిజినెస్ క్లాస్‌లో సీట్లు ఖాళీగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఎకాన‌మీ క్లాస్ టికెట్లు ఇచ్చాన‌ని ఆ ఉద్యోగి చెప్పినా ఎంపీ విన‌లేదు. కాసేపు వాగ్వాదానికి దిగిన త‌ర్వాత అత‌న్ని చెప్పుతో కొట్టారు.

కాగా, జరిగిన ఘటనపై ఓ కమిటీని నియమించి విచారిస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

English summary
High drama was witnessed in an Air India plane soon after it landed at Delhi’s Indira Gandhi International Airport (IGIA) on Thursday morning as Shiv Sena MP Ravindra Gaikwad hit an Air India staffer with slippers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X