క్షమాపణ కోరుతూ కేంద్ర మంత్రి ఆశోక్ కు లేఖ రాసిన శివసేన ఎంపి గైక్వాడ్
ఎయిరిండియా మేనేజర్ పై దాడి చేసిన ఘటనలో విమాన ప్రయాణం చేయకుండా నిషేధానికి గురైన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ మెట్టు దిగాడు.
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్ పై దాడి చేసిన ఘటనలో విమాన ప్రయాణం చేయకుండా నిషేధానికి గురైన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ మెట్టు దిగాడు.పశ్చాతాపం వ్యక్తం చేస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతిరాజుకు లేఖ రాశారు.
గత మాసంలో ఎయిరిండియా మేనేజర్ పై శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి ఘటనతో విమానాల్లో గైక్వాడ్ ను నిషేధం విధించారు.
అంతేకాదు ఈ విషయమై గురువారంనాడు పార్లమెంట్ లో రవీంద్ర గైక్వాడ్ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజుపై దాడి చేసినంత పనిచేశారు శివసేన ఎంపిలు.

ఈ ఘటనలన్నింటిపై రవీంద్ర గైక్వాడ్ పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజుకు లేఖ రాశాడు.దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశం కేంద్రానికి ఉంది.
ఈ లేఖ ఆధారంగా కేంద్రం ఆయనపై విధించిన విమాన ప్రయాణాలపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం లేకపోలేదని సమాచారం. మరో వైపు ఏప్రిల్ 10వ, తేది లోపుగా గైక్వాడ్ పై నిషేధం ఎత్తివేయకపోతే ఎన్డీయే సమావేశాలను బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది.












Click it and Unblock the Notifications