వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ ను బీజేపీ బెదిరించింది: శరద్ పవార్ కు తెలియదు: సంజయ్ రౌత్ ఫైర్..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో బీజేపీ ఇచ్చిన పొలిటికల్ షాక్ తో శివసేన ఖంగుతింది. ఇప్పుడు బీజేపీ తో పాటుగా మద్దతిచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ పైన శివసేన మండిపడుతోంది. అజిత్ పవార్ ను బీజేపీ బెదిరించి లొంగ దీసుకుంది శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈడీ ద్వారా హెచ్చిరకలు చేయించిందని విమర్శించారు. వారు చేసేది సరైనది అయితే అంత గోప్యంగా ప్రమాణ స్వీకారం ఎందుకుని ప్రశ్నించారు. అయితే, శివసేన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు మాత్రం ఈ వ్యవహారం తెలియదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం మీద శివసేన..కాంగ్రెస్..ఎన్సీపీ ఏం చేస్తాయనేది మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు పూర్తి కావటంతో..ఇదే సమయంలో బీజేపీ బల నిరూపణ మీద ఫోకస్ పెట్టింది.

శరద్ పవార్‌కు అజిత్ షాక్: ఎన్సీపీలో రెండు వర్గాలుగా: శివసేన ఎమ్మెల్యేలకు గాలం..శరద్ పవార్‌కు అజిత్ షాక్: ఎన్సీపీలో రెండు వర్గాలుగా: శివసేన ఎమ్మెల్యేలకు గాలం..

అజిత్ ను బీజేపీ బెదిరించింది.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించి..ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ పైన శివసేన మండి పడుతోంది. ఆయన ను బీజేపి బెదిరించి తమ వైపు తిప్పు కొందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈడీ ద్వారా బెదిరింపులకు గురి చేసి..మద్దతు తీసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అజిత్ పవర్ హాహభావాలు చూసిన వారికెవరైనా ఏం జరిగిందో అర్దం చేసుకోవటం పెద్ద సమస్య కాదన్నారు. బీజేపీ చేసింది సరైన విధానమైతే..ప్రమాణ స్వీకారం ఇంత గోప్యంగా చేయాల్సిన అవసరం ఏంటని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అధికారం కోసం ఫడ్నవీస్ ఏదైనా చేస్తారంటూ రౌత్ ఫైర్ అయ్యారు.

అజిత్ పవార్ ది నమ్మక ద్రోహం

అజిత్ పవార్ ది నమ్మక ద్రోహం

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తమ పార్టీ అధినేత శరద్ పవార్ కు నమ్మక ద్రోహం చేసారని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ వ్యవహారం శరద్ పవార్ కు సంబంధం ఉందని తాము భావించటం లేదన్నారు. అజిత్ పవార్ తన చర్యల ద్వారా మహారాష్ట్ర కు అన్యాయం చేసారని దుయ్యబట్టారు. అజిత్ పవార్ శుక్రవారం వరకు తమతోనే ఉన్నారని..ఫోన్ స్వచ్చాఫ్ చేసారని..తాను తన లాయర్ తో ఉన్నట్లుగా చెప్పారని వివరించారు. శుక్రవారం నుండే అజిత్ పవార్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా కనిపించందని వివరించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం ద్వారా బీజేపీ మహారాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్
 ఉద్దవ్ థాక్రేకు శరద్ పవార్ ఫోన్

ఉద్దవ్ థాక్రేకు శరద్ పవార్ ఫోన్

బీజేపీ ఇచ్చిన షాక్ తో ఖంగుతిన్న శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ లో సంభాషించారు. జరిగిన పరిణామాల పైన చర్చించారు. అజిత్ పవార్ బీజేపీతో టచ్ లో ఉన్నట్లుగా తనకు తెలియదని వివరించినట్లుగా సమాచారం. అజిత్ కు పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా వస్తున్న వార్తల పైనా వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు చేయాల్సింది ఏంటనే అంశం పైన చర్చించిన వారిద్దరూ..కాంగ్రెస్ స్పందన సైతం చూసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో..శరద్ పవార్ కు తెలిసే జరిగిందని కాంగ్రెస్ భావిస్తుంటే.. శివసేన మాత్రం శరద్ పవార్ ప్రమేయం లేదని నమ్ముతోంది.

English summary
Shiva Sena MP Sanjay Raut said..Ajith Pawar has stabbed the people of Maharashtra in the back and betrayed Sharad Pawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X