ప్రతిపక్ష కుర్చీల్లో శివసేన: చర్చలుండవని స్పష్టీకరణ
ముంబై: మహారాష్ట్ర శాసనసభ మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. శివసేన సభ్యులు ప్రతిపక్ష బెంచీలకు పరిమితయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమావేశంలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. శివసేన సభ్యులు కాషాయం రుమాళ్లు ధరించి శాసనసభకు వచ్చారు. ప్రతిపక్షాలకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు.
288 మంది శాసనసభ్యులు గల సభలో రెండో అతి పెద్ద పార్టీగా శివసేన అవతరించింది. అందుకు అనుగుణంగా శాసనసభలో సీట్ల ఏర్పాటు జరిగింది. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు సీనియర్ సభ్యుడు జీవా పాండు గవిత్‌తో రాజభవన్‌లో ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు.

గవిత్ కొత్త శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రక్రియ మంగళవారంనాడు కూడా కొనసాగుతుంది. నవంబర్ 12వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ పదవికి పోటీ పడాలనే ఆలోచనతో శివసేన ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపితో ఇక చర్చలు జరిపకూడదని తమ పార్టీ అనుకుంటున్నట్లు శివసేన సీనియర్ నేత నీలం గోర్హే సోమవారం శాసనసభ ఆవరణలో మీడియాతో చెప్పారు. బలపరీక్షలో బిజెపి ఎన్సీపి మద్దతు తీసుకుంటే తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఆదివారంనాడు చెప్పారు. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు బిజెపికి ఆయన రెండు రోజుల గడువు ఇచ్చారు.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓ సభ్యుడు జై విదర్భ అని నినదించగా మరో సభ్యుడు నామో అంటూ ప్రమాణం చేసేటప్పుడు అన్నారు.












Click it and Unblock the Notifications