వంద మంది రాహుళ్లు కూడా మోడీకి సరిరారు: శివసేన
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ మీద శివసేన మండిపడింది. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ ఏ విషయంలోను సాటి రాలేడని విమర్శలు గుప్పించింది.
ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కార్ అంటు రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చెయ్యడం మానుకొవాలని శివసేనకు చెందిన సామ్నా పత్రిక హెచ్చరించింది. ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, అలాగే దేశాని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్నారని గుర్తు చేశారు.

56 రోజుల పాటు సెలవులు తీసుకుని భారత్ వచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో విశ్వాసం నింపడానికి ఉత్సహంగానే ఉన్నారని, అది ఎంత కాలం ఉంటుందో ఆయనకే తెలియదని చురకలు అంటించారు.
బొగ్గు, స్పెక్ట్రమ్ కుంభకోణాలలో సూట్ కేసులు మార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగానే స్పందించింది. ప్రధాని మోడీ పరిపాలన చూసిన భారతదేశంలోని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారని స్పష్టం చేశారు.
సూటు బూటు వేసుకున్న ఈ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సూట్ కేసులు మార్చుకోలేదని గుర్తు చేశారు. 100 మంది రాహుల్ గాంధీలు వచ్చినా మోడీ హవాలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో మండిపడింది.












Click it and Unblock the Notifications