బీజేపీకి ఝలక్: 2019లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం

ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా అంటే 29 ఏళ్లుగా మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కలిసి ప్రయాణం చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 2019లో జరిగిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా, ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Shiv Sena won't ally with BJP for 2019 Lok Sabha, Maharashtra assembly polls

పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ మేరకు ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించారు. 48 లోకసభ స్థానాలకు గాను కనీసం 25 చోట్ల, 288 శాసన సభ స్థానాలకు గాను 150 స్థానాల్లో విజయం సాధించాలని తీర్మానించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+